బ్యాంకుకు వెళ్లి మాత్రమే చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే.. తప్పకుండా బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకోవాలి. బ్యాంకులకు సెలవులు ఎప్పటికప్పుడు.. రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో పాటు జాతీయ, రాష్ట్ర పండుగలు, ఇతర ప్రాంతీయ పండుగల రోజుల్లో బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 10 (శనివారం): నెలలోని రెండవ శనివారం సందర్భంగా.. భారతదేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి. బెంగళూరు, కోల్‌కతాలో మహాలయ అమావాస్య సందర్భంగా బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 11 (ఆదివారం): సాధారణ వారపు ఆదివారం సెలవుదినం సందర్భంగా భారతదేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసివేయబడతాయి. అయితే అక్టోబర్ 5 నుంచి 9 వరకు బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.
అందుబాటులో బ్యాంకింగ్ సేవలు
బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చాలా లావాదేవీలు చేసుకోవచ్చు. యూపీఐ చెల్లింపులు కూడా కొనసాగుతాయి. అవసరమైతే ఏటీఎం ద్వారా నగదు తీసుకోవచ్చు. అయితే.. బ్యాంకు బ్రాంచ్‌కు నేరుగా వెళ్లి చేయాల్సిన పనులు మాత్రం సెలవు రోజుల్లో జరగవు. చెక్కుల క్లియరెన్స్, బ్రాంచ్‌లో చేయాల్సిన కొన్ని లావాదేవీలు వాయిదా పడవచ్చు.
కాబట్టి బ్యాంకు బ్రాంచ్‌లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే.. సెలవు రోజులను ముందుగానే చూసుకుని మీ పనిని ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే మీ ప్రాంతంలోని బ్రాంచ్‌కు సెలవు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని బ్యాంకు అధికారిక మార్గాల ద్వారా ఒకసారి నిర్ధారించుకోవచ్చు.
ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రోజుల్లో అంటే?


