స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. 15 నెలల 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ.10,000కే అందిస్తోంది. సాధారణంగా దాదాపు రూ.16,000 వరకు ఖర్చయ్యే ఈ ప్లాన్‌పై ఏకంగా రూ.6,000 వరకు ప్రయోజనం లభించనుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు మై జియో యాప్‌లో కనిపిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే దీని లభ్యత ప్రాంతం, కనెక్షన్ రకం, కస్టమర్ ప్రొఫైల్‌ను బట్టి మారే అవకాశం ఉంది.
నెలకు రూ.400 తగ్గింపు!
15 నెలలకు రూ.10,000 చెల్లిస్తే నెలకు సగటున రూ.666 పడినట్లవుతుంది. సాధారణ ధరతో పోలిస్తే ఇది నెలవారీ వ్యయంలో సుమారు రూ.400 తగ్గింపు అన్నమాట. అయితే రీచార్జ్ చేసే ముందు మైజియో యాప్‌లో చూపించే జీఎస్టీతో కలిపిన తుది ధర, ప్లాన్ నిబంధనలు పరిశీలించడం మంచిది.
ప్లాన్ ప్రయోజనాలు
ఈ ఫ్రీడమ్ ఆఫర్‌లో 100 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్‌తో అపరిమిత డేటా లభిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాల్స్, 4K స్ట్రీమింగ్, గేమింగ్ వంటి అవసరాలకు ఈ స్పీడ్ ఉపయోగపడుతుంది.
ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 12కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. వీటిలో జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, అనేక ఇతర ప్రసిద్ధ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లు ఉన్నాయి. ఇది ప్రత్యేక ఓటీటీ సబ్స్క్రిప్షన్ల అవసరాన్ని తొలగిస్తుంది. ఓటీటీతో పాటు ఈ ప్లాన్లో 1,000 లైవ్ టీవీ ఛానెళ్లు కూడా ఉన్నాయి.


