హోండా కార్స్ ఇండియాకు కొత్త బాస్! | Honda Cars India Appoints Toshiyuki Yanagisawa As New President And CEO | Sakshi
Sakshi News home page

హోండా కార్స్ ఇండియా సీఈఓగా తోషియుకి!

Jul 31 2026 9:18 PM | Updated on Jul 31 2026 9:18 PM

Honda Cars India Appoints Toshiyuki Yanagisawa As New President And CEO

హోండా కార్స్ ఇండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీ కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా 'తోషియుకి యానగిసావా'ను(Toshiyuki Yanagisawa) నియమించింది. ఈయన 2026 అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం కంపెనీకి నాయకత్వం వహిస్తున్న తకాషి నకాజిమా (Takashi Nakajima) తన పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత.. యానగిసావా ఏషియన్ హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్‌లో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.

తోషియుకి యనగిసావా ప్రస్తుతం హోండా ఇండియా స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌ను నడిపించడంతో పాటు, హోండా డిజిటల్ ఇన్నోవేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (HDII) సీఈఓగా కూడా ఉన్నారు. కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా HDII కార్యకలాపాలను ఆయన కొనసాగించనున్నారు.

భారత మార్కెట్‌లో హోండా తన వ్యాపారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో.. కొత్త సీఈఓను నియమించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ను కీలక మార్కెట్‌గా భావిస్తున్న హోండా.. భవిష్యత్ వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే.. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న కొత్త కారును 2028లో విడుదల చేయాలని కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ప్రస్తుతం హోండా దేశీయ మార్కెట్‌లో అమేజ్, సిటీ, ఎలివేట్ వంటి ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ వాహనాలను దేశంలోనే తయారు చేస్తున్నారు. ఇటీవల హోండా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు జెడ్‌ఆర్-వీ (ZR-V) అనే హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా విడుదల చేసింది. ఈ మోడల్‌ను కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గంలో దిగుమతి చేసుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement