కేవలం రూ.55కే 1000పైగా ఛానళ్లు! | Jio is Offering Premium TV Channels for Rs 55 Only | Sakshi
Sakshi News home page

కేవలం రూ.55కే 1000పైగా ఛానళ్లు!

Jul 31 2026 5:55 PM | Updated on Jul 31 2026 6:05 PM

Jio is Offering Premium TV Channels for Rs 55 Only

జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు. అయితే.. ఇది సాధారణ రీచార్జ్ ప్లాన్ కాదు. ఎందుకంటే.. ఈ వోచర్‌ను ఉపయోగించాలంటే ఇప్పటికే యాక్టివ్‌లో ఉన్న ఒక బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. బేస్ ప్లాన్ లేకపోతే ఈ వోచర్ పనిచేయదు.

రూ.55 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే దీని ద్వారా 10ఎంబీ డేటా మాత్రమే లభిస్తుంది. డేటా పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. టీవీ ఛానల్స్ చూడటానికి పనికొస్తుంది. జియోటీవీ యాప్‌లో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లకు చెందిన ఛానల్స్ అందుబాటులో ఉంటాయి.

స్టార్ ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సోనీ సెట్ హెచ్‌డీ, సోనీ సబ్ హెచ్‌డీ వంటి ప్రముఖ ఛానళ్లను కూడా వీక్షించవచ్చు. అయితే జియోస్టార్‌కు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు ఈ ప్లాన్‌లో ఉండవు. తక్కువ ఖర్చుతో మొబైల్‌లో లైవ్ టీవీ చూడాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్లాన్ మంచి ఎంపిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement