టెలికాం రంగంలో రోజురోజుకూ పోటీ పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా ఓటీటీ సేవలను కూడా తమ ప్లాన్లలో భాగం చేస్తున్నాయి. రూ. 200 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్లను రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా అందిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ జియో
రిలయన్స్ జియో అందిస్తున్న రూ.200 డేటా వోచర్ ద్వారా30 జీబీ 4జీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. సాధారణ డేటాతో పాటు వినోదం కోసం అనేక ఓటీటీ సేవలు కూడా లభిస్తాయి.
యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ , జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్‌నెక్స్ట్, కంచ లంకా, ఈటీవీవిన్, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్‌కోడ్, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్, జియోటీవీ వంటి మొత్తం 16 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ లభిస్తుంది. అంతే కాకుండా 1000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను చూసే అవకాశం కూడా ఉంటుంది.
ఇందులో వినియోగదారుల కోసం సినీపోలిస్ ఆఫర్ కూడా ఉంది. వినియోగదారులు మైజియో యాప్‌లో కంపెనీ నుంచి ఒక వోచర్‌ను పొందుతారు. ఈ వోచర్ కనీసం రూ. 550 కొనుగోలు విలువపై.. రెండు టిక్కెట్లు కొనుగోలు చేస్తే రూ. 150 తగ్గింపును అందిస్తుంది. అలాగే ఫుడ్ అండ్ బేవరేజెస్‌పై 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా
వొడాఫోన్ ఐడియా కూడా రూ.200 ధరలో ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో కూడా 28 రోజుల వ్యాలిడిటీతో 30జీబీ డేటా లభిస్తుంది. ఇది అన్‌లిమిటెడ్ 5G డేటా సదుపాయం. ఒకే రీచార్జ్‌తో వినియోగదారులు 5G సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఓటీటీ విషయానికి వస్తే.. ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, షెమరూమీ, మనోరమామాక్స్, ఫ్యాన్‌కోడ్, ప్లేఫ్లిక్స్, క్లిక్, అట్రంగి, చౌపాల్, OTTప్లే లైవ్, పాకెట్ ఫిల్మ్స్, యుప్‌టీవీ, అడ్డాటైమ్స్, కంచ లంకా, టైమ్స్‌ప్లే, నెక్స్ట్‌జీటీవీ వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఏ ప్లాన్ ఎంచుకోవాలి?
జియో, వొడాఫోన్ ఐడియా అందించే రూ.200 ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఒకే విధంగా ఉన్నాయి. రెండు ప్లాన్లలో 30జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, ఓటీటీ సేవలు ఉన్నాయి. కానీ 5జీ డేటాను ఎక్కువగా ఉపయోగించే వారికి వొడాఫోన్ ఐడియా ప్లాన్ కొంత మెరుగైన ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఇందులో అన్‌లిమిటెడ్ 5G సదుపాయం ఉంది.
అయితే.. యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో వంటి సేవలు కావాలనుకునే వారికి జియో ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసే వారికి జియో అందిస్తున్న ఓటీటీ ప్రయోజనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తం మీద రూ.200 బడ్జెట్‌లో జియో, వొడాఫోన్ ఐడియా రెండూ మంచి ఎంపికలే. అయితే.. మీ అవసరాన్ని బట్టి సరైన ప్లాన్ ఎంచుకోవాలి.


