బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కారణం అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అంటే మార్కెట్లో ఊహకందని పరిణామాలు జరగలేదన్నమాట. అయినప్పటికీ త్వరలోనే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధరలపై అత్యధిక ప్రభావం చూపుతున్నది అమెరికా ఆర్థిక వ్యవస్థ. యూఎస్ డాలర్ విలువ పెరగడం, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రాబడులు అధికంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి, ధరలు కూడా పతనమవుతున్నాయి.
దేశీయ మార్కెట్లో ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1550 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.750 తగ్గింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రూ.200 రీఛార్జ్ ప్లాన్.. జియో vs వొడాఫోన్ ఐడియా!


