చెప్పిందే జరుగుతోంది.. కియోసాకి హెచ్చరిక! | Global Economy Is Crashing: Robert Kiyosaki Urges People to Act Now | Sakshi
Sakshi News home page

చెప్పిందే జరుగుతోంది.. కియోసాకి హెచ్చరిక!

Jul 31 2026 4:47 PM | Updated on Jul 31 2026 6:27 PM

Global Economy Is Crashing Robert Kiyosaki Urges People to Act Now

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి గురించి తాను చాలా సంవత్సరాల క్రితమే 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' అనే పుస్తకంలో హెచ్చరించానని కియోసాకి పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుత పరిస్థితిని చూసి ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పుస్తకంలో ఇచ్చిన సూచనలను పాటించిన వారు ఈరోజు ఆర్థికంగా కొంత భద్రంగా ఉన్నారని కియోసాకి పేర్కొన్నారు.

అయితే.. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. సరైన నిర్ణయాలు తీసుకుంటే మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవడం, ఖర్చులను నియంత్రించడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలని కియోసాకి సూచిస్తున్నారు.

ప్రతి ఆర్థిక సంక్షోభం ఒక పరీక్ష లాంటిది. ఇలాంటి సమయాల్లో చాలా మంది తమ సంపదను కోల్పోతారు. కానీ.. కొందరు మాత్రం పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం వల్ల మరింత ధనవంతులుగా మారుతారని కియోసాకి అభిప్రాయపడ్డారు.

భయపడకుండా, ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి చెబుతున్నారు. అయితే ఆర్ధిక విషయాల్లో తప్పకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే అవసరమైన మార్పులు చేసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement