ఎండీ, సీఈఓగా బాధ్యతల స్వీకరణ
బెంగుళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు కెనరా నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బ్రజేష్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం మే 30న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బ్రజేష్ కుమార్ సింగ్ 2029 ఏప్రిల్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
మాజీ ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణ రాజు పదవీ విరమణ అనంతరం స్థానంలో నియమితులయ్యారు. బ్రజేష్ కుమార్ సింగ్‌కు బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కెనరా బ్యాంక్‌లో చేరకముందు ఇండియన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలహాబాద్ అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించారు.
ఫైనాన్స్‌లో ఎంబీఏ పట్టా పొందారు. బ్రజేష్ కుమార్ సింగ్ నాయకత్వంలో కెనరా బ్యాంక్ డిజిటల్ పరివర్తనను మరింత వేగవంతం చేయనుంది. ఆర్థిక చేరిక విస్తరణ, ఆస్తుల నాణ్యత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వినియోగదారుల సేవలను మెరుగుపరుస్తూ, షేర్ హోల్డర్లకు స్థిరమైన విలువను సృష్టించడమే లక్ష్యమని బ్యాంక్ తెలిపింది.


