జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీగా ఆకాష్ అంబానీ | Jio Platforms appoints Akash Ambani as MD | Sakshi
Sakshi News home page

జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీగా ఆకాష్ అంబానీ

May 14 2026 7:51 PM | Updated on May 14 2026 8:24 PM

Jio Platforms appoints Akash Ambani as MD

డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ తన ఐపీఓకు ముందు.. ఆకాష్ అంబానీని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 9, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా 5 సంవత్సరాల కాలానికి ఎండీగా నియమించినట్లు మే 7నాటి ఫైలింగ్‌లో పేర్కొంది.

ఆకాష్ అంబానీ అక్టోబర్ 2014 నుంచి జియో ప్లాట్‌ఫామ్స్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (RJIL) బోర్డులో ఉన్నారు. జూన్ 2022లో ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హయాంలో 2016లో ప్రారంభమైన ఆరు నెలల లోపే జియో 100 మిలియన్ల చందాదారుల మార్కును సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 30,000 కోట్లకు పైగా లాభాన్ని.. రూ. 1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement