
హోమ్ ఫర్నిషింగ్స్ దిగ్గజం ఐకియా ఇండియా కొత్త సీఈవోగా ప్యాట్రిక్ ఆంటోనీ నియమితులయ్యారు. ఆగస్టు నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. కంట్రీ రిటైల్ మేనేజర్, చీఫ్ సస్టైనబిలిటీ మేనేజర్‌గా (సీఎస్‌వో) కూడా ఆయన వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది.
ప్రస్తుత కంట్రీ రిటైల్ మేనేజర్, సీఎస్‌వో సుసాన్ పల్వరర్ రాజీనామా చేయడంతో ఆంటోనీ నియమితులయ్యారు. ఐకియాలో సుసాన్ సుమారు 28 ఏళ్లు పనిచేశారు. అయిదేళ్ల పాటు డిప్యుటీ సీఈవోగా కూడా వ్యవహరించారు. 2018లో హైదరాబాద్‌లో తొలి స్టోర్ ప్రారంభించిన ఐకియా ప్రస్తుతం రెండో విడత విస్తరణపై దృష్టి పెడుతోంది.