అరబిందో ఫార్మా లాభం 25 శాతం అప్‌  | Aurobindo Pharma Q1 Net Profit Rises 25% to Rs 1,032 Cr; Revenue Up 16% | Sakshi
Sakshi News home page

అరబిందో ఫార్మా లాభం 25 శాతం అప్‌ 

Aug 7 2026 2:24 AM | Updated on Aug 7 2026 11:48 AM

Aurobindo Pharma Q1 net rises 25percent to Rs 1,032 cr

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా రూ. 1,032 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ1లో లాభం రూ. 824 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ. 7,868 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ. 9,150 కోట్లకు చేరింది. వివిధ వ్యాపార విభాగాలవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వృద్ధితో 2027 ఆర్థిక సంవత్సరాన్ని మెరుగ్గా ప్రారంభించినట్లు సంస్థ ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. 

సమీక్షాకాలంలో ఫార్ములేషన్స్‌ వ్యాపార విభాగం ఆదాయం రూ. 6,953 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ. 8,101 కోట్లకు, ఏపీఐ విభాగం రూ. 916 కోట్ల నుంచి సుమారు 15 శాతం పెరిగి రూ. 1,049 కోట్లకు చేరింది. కీలకమైన అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్‌ ఆదాయం రూ. 3,488 కోట్ల నుంచి రూ. 3,770 కోట్లకు పెరిగింది. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి పది ఉత్పత్తులకు అనుమతులు లభించినట్లు సంస్థ తెలిపింది. అనుబంధ సంస్థ యూజియా ఫార్మా స్పెషాలిటీస్‌లో యూజియా స్టెరైల్స్, యూజియా సెజ్‌ల విలీనానికి సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది.  

అరబిందో ఫార్మా షేరు 1.5 శాతం తగ్గి రూ. 1,589 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement