రూ. 4,896 కోట్ల ఎఫ్‌డీఐలు.. | India Receives 29 FDI Proposals Worth ₹4,896 Crore Under Revised China Investment Rules, Check Out More Details | Sakshi
Sakshi News home page

రూ. 4,896 కోట్ల ఎఫ్‌డీఐలు..

Aug 22 2026 5:28 PM | Updated on Aug 22 2026 5:52 PM

India FDI Rs 4896 Crore 29 Proposals China Investment Rules

న్యూఢిల్లీ: ఆటోమాటిక్‌ మార్గంలో లభించిన 29 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) సమాచారం అందినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వీటి విలువ రూ. 4,896 కోట్లుకాగా.. మే నెలలో ప్రభుత్వం చైనాకు వాటాగల ఎఫ్‌డీఐలపై మార్గదర్శకాలను సవరించింది. తద్వారా చైనా కంపెనీలకు 10 శాతంలోపు వాటాగల విదేశీ సంస్థలు ఆటోమాటిక్‌ మార్గంలో దేశీయంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. వెరసి మే 1 నుంచి 2026 ఆగస్ట్‌ 20కల్లా 29 ప్రతిపాదనల వివరాలు దాఖలైనట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ తెలియజేసింది.

ఐటీ, ఏఐ, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్, తయారీ, ఫార్మాస్యూటికల్స్, డేటా సెంటర్లు, రవాణా సరీ్వసులలో తాజా పెట్టుబడులు నమోదైనట్లు వెల్లడించింది. పెట్టుబడులు మారిషస్, యూఎస్, కొరియా, జపాన్, సింగపూర్, లక్సెమ్‌బర్గ్, కేమన్‌ ఐలాండ్స్‌ నుంచి లభించినట్లు పేర్కొంది. మే నెలకంటే ముందు భారత్‌తో సరిహద్దును పంచుకునే దేశాల కంపెనీలకు వాటా కలిగిన విదేశీ సంస్థలు ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవలసి ఉండేది. మేలో చేపట్టిన మార్గదర్శకాల సవరణల తదుపరి ఆటోమాటిక్‌ మార్గంలో పెట్టుబడులకు అనుమతి లభిస్తోంది. అయితే ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయవలసి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement