గోల్డ్‌ లోన్లలో దేశంలోనే నంబర్‌‌ 1 రాష్ట్రం! | Tamil Nadu alone accounted for one third of India total gold loan | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ లోన్లలో దేశంలోనే నంబర్‌‌ 1 రాష్ట్రం!

Oct 6 2026 5:18 PM | Updated on Oct 6 2026 6:23 PM

Tamil Nadu alone accounted for one third of India total gold loan

భారతదేశ గోల్డ్‌ లోన్‌  మార్కెట్‌లో తమిళనాడు రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పసిడి రుణ పోర్ట్‌ఫోలియోలో ఒక్క తమిళనాడు వాటానే ఏకంగా 32 శాతంగా నమోదు కావడం ఆర్థిక రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల తాజా నివేదికలు, అధికారిక సమాచారం ప్రకారం.. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ స్థాయిలో పసిడి రుణాలను పొందలేదని స్పష్టమవుతోంది.

ఇందుకు కారణాలేమిటి?

ఈ అసాధారణ వృద్ధి వెనుక తమిళనాడు ప్రత్యేకమైన సామాజిక-ఆర్థిక పరిస్థితులు, బ్యాంకింగ్ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), వ్యవసాయ రంగానికి అత్యవసర నిధులు అవసరమైనప్పుడు బంగారంపై రుణాలు తీసుకోవడమే అత్యంత వేగవంతమైన, సరసమైన మార్గంగా భావిస్తారు. ఇతర సాంప్రదాయ రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్స్ మంజూరు త్వరగా జరగడం, ప్రాసెసింగ్ సులభంగా ఉండటంతో అక్కడి వర్తకులు, రైతులతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.

విస్తృత నెట్‌వర్క్‌

తమిళనాడులో సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీల విస్తృతమైన నెట్‌వర్క్ ఉండటం కూడా ఈ వృద్ధికి మరో ప్రధాన కారణం. మహిళల సాధికారత, స్వయం సహాయక బృందాల ఆర్థిక కార్యకలాపాల్లో బంగారం తాకట్టు రుణాలు కీలక సాధనంగా మారాయి.

అయితే, మొత్తం దేశీయ గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోలో దాదాపు మూడో వంతు భాగం ఒక్క రాష్ట్రంలోనే కేంద్రీకృతమై ఉండటం పట్ల ఆర్థిక నిపుణులు విశ్లేషణలు జరుపుతున్నారు. ఇది ఒక వైపు తమిళనాడులో క్రెడిట్ అందుబాటును హైలైట్‌ చేస్తున్నప్పటికీ, మరోవైపు చిన్న తరహా రుణాల కోసం బంగారంపైనే ఎక్కువగా ఆధారపడుతున్న తీరును సూచిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా, బంగారం ఆధారిత రుణాల విస్తరణలో తమిళనాడు దేశానికే ఒక సరికొత్త దిక్సూచిగా నిలిచింది.

ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణంపై కొత్త ఆందోళన! ధరలకు రెక్కలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement