ఘోరం.. 453 మంది అదృశ్యం, నిర్బంధం | Taiwan Raises Alarm A 453 Citizens Reportedly Go Missing, Face Detention And Movement Restrictions In China | Sakshi
Sakshi News home page

ఘోరం.. 453 మంది అదృశ్యం, నిర్బంధం

Oct 5 2026 3:49 PM | Updated on Oct 5 2026 4:22 PM

Taiwan raises alarm over 453 citizens missing or detained in China

చైనాలో తమ పౌరులు అదృశ్యం కావడం, నిర్బంధానికి గురికావడం లేదా వారి కదలికలపై ఆంక్షలు విధిస్తుండడంపై తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది. 2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు ఇలాంటి కేసులు మొత్తం 453 నమోదైనట్లు తైవాన్ మెయిన్‌ల్యాండ్ అఫైర్స్ కౌన్సిల్ తాజా నివేదికలో వెల్లడించింది.  

తాజా నివేదిక ప్రకారం మరో నలుగురు తైవాన్ పౌరులు చైనాలో అదృశ్యమైనట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో అదృశ్యమైన వారి సంఖ్య 172కు చేరింది. మరో 39 మందిని విచారణ కోసం నిర్బంధించినట్లు నమోదైంది. 242 మంది చైనా అధికారుల అదుపులో ఉన్నట్లు కౌన్సిల్ పేర్కొంది. ఇదే సమయంలో నలుగురు తైవాన్ ప్రభుత్వ ఉద్యోగులను చైనా అధికారులు విచారించినట్లు కూడా కౌన్సిల్‌కు సమాచారం అందింది.

వీరిలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు చెందిన ఓ అధికారి, ఓ పన్నుల శాఖ ఉద్యోగి, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ నర్సు ఉన్నారు. గతంలో సైనిక ఆసుపత్రిలో పనిచేసిన ఆ నర్సును చైనా భద్రతా అధికారులు ఆ ఆసుపత్రికి సంబంధించిన సమాచారంపై ప్రశ్నించినట్లు నివేదిక తెలిపింది.

అవయవాలు తొలగించారా?
తైవాన్ నర్సును ఇలా విచారించిన తొలి కేసుగా దీనిని పేర్కొన్నారు. చైనాలో అదృశ్యమైన తైవాన్ పౌరులకు అవయవాల తొలగింపు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన తైవాన్ ప్రభుత్వ అధికారి.. అలా జరిగిందా లేదా అనేది ప్రస్తుతం అధికారులకు తెలియదని చెప్పారు.

అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ ఇంకా లభించలేదని, అవయవాల తొలగింపు జరిగినట్లు వారి కుటుంబ సభ్యులు ఎవరూ నివేదించలేదని తెలిపారు. ఈ అనుమానాల నేపథ్యంలో తైవాన్‌లోని తావోయువాన్ జిల్లా ప్రాసిక్యూటర్లు గత నెలలో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అధిక వేతనాల ఉద్యోగాల పేరుతో వ్యక్తులను చైనాకు తరలించి, వారి అవయవాలను తొలగించేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై దర్యాప్తు అనంతరం ఈ చర్య తీసుకున్నారు.

మోసపోయిన ముగ్గురిని చైనా వెలుపలికి తరలించలేదని అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో చైనాలోని వైద్య సంస్థలు లేదా సిబ్బంది ప్రమేయం ఉందా, అలాగే ఈ చర్యలు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంతో సంబంధమా లేక నేర సంస్థల కార్యకలాపాలా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అదృశ్యమైన మరెంత మంది తైవాన్ పౌరులు ఇలాంటి నేరాలకు లక్ష్యంగా మారారో కూడా అధికారులు పరిశీలించనున్నారు.  

ఇదీ చదవండి: మృత్యువు అంచుల వరకు వెళ్లిన ప్రయాణికుడు.. చావును ఎలా గెలిచాడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement