అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే.. చాలామంది తమ వద్ద ఉన్న బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance) ఒక మంచి గోల్డ్ లోన్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో మీరు.. మీ బంగారం విలువలో 85 శాతం వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యాల్యూ, స్పీడ్, సేవింగ్స్ అనే మూడు ప్రధాన ప్రయోజనాలను అందిస్తున్నట్లు ముత్తూట్ ఫైనాన్స్ వెల్లడించింది. తక్కువ సమయంలోనే లోన్ అందించడం, సులభమైన ప్రక్రియతో సేవలు అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ చెబుతోంది.
గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు మొబైల్ నెంబర్, పిన్‌కోడ్ ఎంటర్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. సంస్థ నిబంధనలు, షరతులకు అంగీకరించిన తర్వాత దరఖాస్తు పూర్తి చేయవచ్చు.
ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ప్రత్యేకత
ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ప్రత్యేకత ఏమిటంటే.. లోన్ అందించే ప్రక్రియ చాలా వేగంగా ఉండటం. బంగారం విలువను అంచనా వేసిన వెంటనే లోన్ అందించే విధానాన్ని సంస్థ అనుసరిస్తోంది. అంతే కాకుండా.. వడ్డీ రేట్లు, కస్టమర్‌కు అనుకూలమైన సేవలతో మంచి గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యధిక గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో కలిగిన సంస్థగా ముత్తూట్ ఫైనాన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ముత్తూట్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా 7,500కు పైగా శాఖలతో సేవలు అందిస్తోంది. రోజూ 2.5 లక్షలకు పైగా వినియోగదారులు తమ సేవలను వినియోగిస్తున్నారని, కేవలం ఒక్కసారి శాఖను సందర్శిస్తే వెంటనే గోల్డ్ లోన్ పొందే అవకాశం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది.
Gold Loan@Home గురించి
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ Gold Loan@Home అనే ప్రత్యేక సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవ ద్వారా ఇంటి నుంచే గోల్డ్ లోన్ పొందే అవకాశం ఉంది. దీనికోసం ముందుగా లోన్ కోసం రివెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సంస్థ ప్రతినిధులు ఇంటికే.. వచ్చి బంగారం విలువను అంచనా వేస్తారు. ఆ తర్వాత డబ్బు నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. దీంతో శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంటి నుంచే సౌకర్యవంతంగా లోన్ పొందవచ్చు.


