వెంకి పెళ్లి సుబ్బిసావుకొచ్చింది అనే సామెత మనం తరచుగా వాడుతుంటాం... సరిగ్గా అటువంటి సన్నివేశమే ఇక్కడ సరిగ్గా సరిపోయింది. ఇటీవల 80'80's ట్రెండ్ పేరుతో సోషల్ మీడియాలో పిక్స్ పెట్టడం పెద్దఎత్తున వైరల్‌గా మారాయి. ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. అదే తనను కటకటాల్లో పెట్టేలా చేసింది. దీంతో తలపట్టుకోవడం ఆ మహిళ వంతైంది.
వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 45 ఏళ్ల క్రితం ఓ స్వర్ణకారుడి దుకాణంలో ఒక మహిళ హారం దొంగలించి పరారైంది, అనంతరం తన పేరు మార్చుకుని వేరే ప్రాంతంలో జీవనం సాగిస్తోంది. అయితే ఇదిలా ఉండగా ఇటీవల వైరల్‌గా మారిన 80's ట్రెండ్‌లో పాల్గొని తన ఫోటోను కూడా 80's ట్రెండ్‌కు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన స్వర్ణకారుడు తన దుకాణంలో దొంగతనం చేసింది ఈమె అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో ఈ కేసును రీఓపెన్ చేసిన పోలీసులు తనను పట్టుకొని విచారించగా తానే దొంగతనం చేసినట్టు ఒప్పుకుంది. దీంతో తనను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వెంకి పెళ్లి సుబ్బి సావుకు రావడం అంటే ఇదేనేమో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.


