‘వాస్తవాన్ని చూపండి’ అంటూ యువతకు ‘సీజేపీ’ సౌరభ్ ​కీలక పిలుపు | Cockroach Janta Party Saurabh Das key announcement | Sakshi
Sakshi News home page

‘వాస్తవాన్ని చూపండి’ అంటూ యువతకు ‘సీజేపీ’ సౌరభ్ ​కీలక పిలుపు

Sep 15 2026 7:29 PM | Updated on Sep 15 2026 8:11 PM

 Cockroach Janta Party Saurabh Das key announcement

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పాఠశాలల పరిస్థితులను పరిశీలించేందుకు కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన సౌరభ్ దాస్ నేతృత్వంలో ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం ప్రారంభమైంది. పాఠశాలల్లో పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో చదువుతున్నారో పరిశీలించి, వాటిని నమోదు చేయనున్నట్లు దాస్ తెలిపారు.

మంగళవారం నోయిడాకు వచ్చిన దాస్ మాట్లాడుతూ.. నగరంలోని కొన్ని పాఠశాలలను బృందం పరిశీలించనుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నోయిడాను మెరుగైన జిల్లాల్లో ఒకటిగా పరిగణిస్తారని, అక్కడి పాఠశాలల పరిస్థితి కూడా అందుకు తగ్గట్టుగానే ఉందో లేదో తమ పరిశీలనలో తేలుతుందని అన్నారు. “ఈరోజు మేం నోయిడాకు వచ్చాం. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా కొన్ని పాఠశాలలను తనిఖీ చేయబోతున్నాం. పిల్లలు చదువుతున్న పరిస్థితులను చూస్తాం. పరిస్థితి ఏదైనా ఉంటే దాన్ని మీకు చూపిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని యువత వారి వారి ప్రాంతాల్లోని పాఠశాలలను కూడా పరిశీలించాలని దాస్ కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, పిల్లలకు ఎలాంటి విద్య అందుతోంది? అన్న విషయాలను స్వయంగా పరిశీలించి నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

సీజేపీ ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమాన్ని ఆగస్టులో దేశవ్యాప్తంగా సామాజిక తనిఖీ కార్యక్రమంగా ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రాథమిక సదుపాయాలను పరిశీలించడమే దీని ఉద్దేశమని పార్టీ తెలిపింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొలి తనిఖీ జరిగింది. అక్కడ తాగునీరు, బెంచీలు, మరుగుదొడ్ల పరిశుభ్రత, పగిలిన కిటికీలు, నీటి సరఫరా వంటి సమస్యలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రస్తావించారు.

తదుపరి తనిఖీల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే సామగ్రి వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. నోయిడా తనిఖీల ఫలితాలు, ఇతర ప్రాంతాల్లో యువత చేపట్టే పరిశీలనలు ఈ కార్యక్రమానికి తదుపరి దిశను నిర్ణయించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement