సాక్షి, న్యూఢిల్లీ: యువత నిరసలతో దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు కదా. ఇవాళ ఎంపీ హోదాలో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కోసం వచ్చారు. అయితే ఆయన రాక సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో నినాదాల పోరు కనిపించింది.
సోమవారం ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కారు దిగి దిగగానే ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా “ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. ఆయనను హీరోలా స్వాగతిస్తూ.. నెత్తిన టోపీ పెట్టి ఎన్డీయే ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఫొటోలు కూడా దిగారు. అదే సమయంలో..
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసిన ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం కొద్దిసేపు హోరెత్తింది. అయితే ఎన్డీయే ఎంపీలు అవేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ పోయారు. అలా.. ఒకేసారి డబుల్ వెల్‌కమ్ దక్కింది ఆయనకు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నీట్ వ్యవహారంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 36 రోజుల తర్వాత నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను నైతిక బాధ్యత తీసుకున్న నిర్ణయంగా ఎన్డీయే నేతలు అభివర్ణిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు మాత్రం నీట్ అవకతవకలకు ఆయన రాజీనామా చేయడం సరైందేనని అంటున్నాయి.
#WATCH | Delhi: Former Union Education Minister and BJP MP Dharmendra Pradhan arrives at the Parliament.
BJP-NDA MPs sloganeer "Dharmendra Pradhan zindabad" as they receive him here. pic.twitter.com/7DHXIzMkvI— ANI (@ANI) July 27, 2026


