
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన జాబితాలో ఇందిరా గాంధీ రికార్డును బద్ధలు కొట్టారు.
భారత దేశంలో వరుసగా సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత.. జవహార్ లాల్ నెహ్రూది. ఆయన అత్యధిక కాలం (6,130 రోజులు) ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రికార్డు ఇందిరా గాంధీ(4,077 రోజులు) పేరిట ఆ ఘనత ఉండేది. తాజాగా ఆ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు.
శుక్రవారం(జులై 25)తో నరేంద్ర మోదీ భారత దేశ ప్రధానిగా 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించినట్లైంది. అలాగే.. భారత్‌కు సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన రెండో వ్యక్తి ఘనతకు సొంతం చేసుకున్నారు. అంతేకాదు..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తిగా, రెండు దఫాలు ప్రధాని పదవీ కాలం పూర్తి చేసుకున్న వ్యక్తి.. మోదీనే. అలాగే.. కాంగ్రెస్‌యేతర ప్రధానిగా, హిందీయేతర రాష్ట్ర వ్యక్తిగానూ మోదీ నిలిచారు.
మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
2019లో రెండవసారి, 2024లో మూడవసారి పదవిలోకి వచ్చారు.
నరేంద్ర మోదీ ఇప్పటివరకు (జూలై 25, 2025 వరకు) భారతదేశ ప్రధానమంత్రిగా 4,078 రోజులు పాలన అందించారు.
ఇప్పటిదాకా మొత్తం కాలం 11 సంవత్సరాలు, 1 నెల, 29 రోజులు
ఫలితంగా వరుసగా భారత ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, భారతదేశంలో రెండవ అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ నిలిచారు.
ఇందిరా గాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా రెండు విడతలలో సేవలందించారు:
మొదటిసారి పదవీకాలం..
24 జనవరి 1966 నుండి 24 మార్చి 1977, 11 సంవత్సరాలు, 2 నెలలు
రెండోసారి పదవీకాలం
14 జనవరి 1980 నుండి 31 అక్టోబర్ 1984 (ఆమె హత్యకు ముందు వరకు) 4 సంవత్సరాలు, 9 నెలలు, 17 రోజులు
మొత్తం పదవీ కాలం
15 సంవత్సరాలు, 11 నెలలు, 17 రోజులు
దేశానికి స్వాతంత్య్రంచ్చినప్పటి నుంచి నెహ్రూ ఆ పదవిలో కొనసాగారు. జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా 15 ఆగస్టు 1947న పదవీ బాధ్యతలు స్వీకరించి, 27 మే 1964న ఆయన మరణించేవరకు పదవిలో కొనసాగారు. అంటే.. మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు ఆ పదవిలో ఉన్నారన్నమాట. ఇది భారత ప్రధానమంత్రిగా ఇప్పటివరకు అత్యధిక కాలం సేవలందించిన రికార్డు నెహ్రూదే.