
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి జీవించాలని ఆశ పడి బిడ్డను హత్య చేశానని మహిళ వాంగ్మూలం ఇచ్చింది. కోయంబత్తూర్, ఇరుకూరుకు చెందిన తమిళరసి (30). ఈమె భర్త రఘుపతి. వారికి అపర్ణశ్రీ(4) కుమార్తె ఉంది. రఘుపతి కొన్ని నెలల క్రితం భార్య నుంచి విడిపోయాడు.
దీని తరువాత, తమిళరసి తన బిడ్డ అపర్ణశ్రీతో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె కట్టడ నిర్మాణ పనులకు వెళుతుంటుంది .ఆ సమయంలో కట్టడ కారి్మకుడు ధర్మపురి జిల్లాకు చెందిన వసంత్ అనే వ్యక్తితో తమిళఅరసికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బిడ్డను గొంతు నులిమి హత్య చేసింది.
పోలీసులు తమిళరసిని అరెస్టు చేసి విచారణ జరిపారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ‘నా భర్త విడిపోయిన తర్వాత, వసంత్‌తో సంబంధం ఏర్పడింది. వసంత్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇందుకు బిడ్డ ఉంటే తాను అంగీకరించనని, ఒంటరిగా వస్తే తాను అంగీకరిస్తానని చెప్పాడు. పిల్లవాడిని హత్య చేయడం తప్ప తనకు వేరే మార్గం లేదని నిందితురాలు తెలిపింది. బిడ్డ హత్యకు ప్రేరేపించినందుకు వసంత్‌ను ఆదివారం అరెస్టు చేశారు.