
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్‌లో(లోక్‌సభ) చర్చ వేళ.. భారతసైన్యం ఘన విజయం సాధించింది. పహల్గాం ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ అలియాస్ ముసాను శ్రీనగర్‌లో మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది.
జమ్ము కశ్మీర్‌లో ఆపరేషన్ మహదేవ్ పేరిట ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. మహదేవ్ పర్వత ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఉదయం 11.30 గం.ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో సోమవారం దాచిగాం ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ముగ్గురు ముష్కరులు మరణించారు. తొలుత వీళ్లకు పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు అనుమానించారు.
అయితే.. మృతుల్లో లష్కరే తాయిబా ఉగ్రవాది సులేమాన్ ఉన్నట్లు భద్రతా బలగాలు దృవీకరించాయి. సులేమాన్ అలియాస్ హషీమ్ మూసా గతంల పాక్ ఆర్మీలో పని చేశాడు. మూసా మృతిని భారత సైన్యం ధృవీకరించింది. అనంత్ నాగ్ జిల్లా పహల్గాం బైసరన్ లోయలో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్న సమయంలో.. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను బలిగొన్నారు. ఈ దాడికి మాస్టర్‌మైండ్ సులేమాన్ అలియాస్ ముసానే.
సోమవారం ఉదయం శ్రీనగర్ లిద్వాస్ దగ్గర ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మూసాతో పాటు అబూ హమ్జా, యాసిర్‌లు ఉన్నారు. ఈ ఇద్దరూ పహల్గాం దాడిలో పాల్గొన్నారు. డ్రోన్‌ల ద్వారా మృతదేహాలను గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే 47 రైఫిల్స్ ,17 గ్రానైడ్లు లభ్యమయ్యాయి.

పహల్గాం దాడిలో పాల్గొంది ఈ ఉగ్రవాదులే.. మూసా(కుడివైపు చివర)
అలాగే.. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తెలియజేస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ములనార్, హర్వాన్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు సమాచారం.

OP MAHADEV
Contact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025