breaking news
Operation Mahadev
-
జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లో ఎన్కౌంటర్
-
ఆపరేషన్ మహదేవ్ పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ హతం
శ్రీనగర్: ‘పహల్గాం’ గాయానికి ప్రతీకారం మొదలైంది. దేశమంతటా ఆగ్రహావేశాలు రగిల్చిన ఆ దాడికి పాల్పడ్డ ఉగ్ర ముష్కరులకు కౌంట్‌డౌన్ మొదలైంది. పహల్గాం దాడి సూత్రధారి అయిన ఉగ్ర ముష్కరుడు హషీం మూసా అలియాస్ సులేమాన్ అలియాస్ ఆసిఫ్‌ను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట జరిపిన భీకర ఎన్కౌంటర్లో సులేమాన్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎలైట్ పారా కమెండో దళాలు కాల్చిపారేశాయి. వారిని జిబ్రాన్, హంజా అఫ్గానీగా గుర్తించారు. జిబ్రాన్ గతేడాది సోనామార్గ్‌లో టన్నెల్ ప్రాజెక్టు పనులు చేస్తున్న సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముఠా సభ్యుడని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే రైఫిళ్లు, మందుగుండు, గ్రెనేడ్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నా రు. ముష్కరుల మృత దేహాలను బలగాలు స్థానిక పోలీసులకు అప్పగించాయి. ఈ ముష్కరులకు సన్ని హితులైన మరో ఉగ్ర ముఠా సభ్యులు సైతం ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలోనే నక్కినట్టు బలగాలకు సమాచారం అందింది. దాంతో సమీప ప్రాంతాలన్నింటినీ దిగ్బంధించి జల్లెడ పడు తున్నారు. ‘ఆపరేషన్ మహదేవ్’ ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నట్టు సైనిక, స్థానిక పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం భారీ సంఖ్యలో అదనపు బలగాలను మోహరించారు. సై న్యం, భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసు విభాగ సి బ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నా రు. ఆపరేషన్ మహదేవ్ ఇప్పట్లో ముగి యబోదని కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిద్రీ స్పష్టం చేశారు..కునుకు తీస్తుండగానే...హషీం మూసా. అలియాస్ అబూ సులేమాన్. అలియాస్ ఆసిఫ్. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తయిబా టాప్ కమాండర్. పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి. ఆపరేషన్ మహదేవ్లో మన బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు ముష్కరుల్లో అతి ముఖ్యుడు. అయితే ఇంతటి విజయం అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. ఇందుకోసం సైన్యం అవిశ్రాంతంగా శ్రమించింది. సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్తో కలిసి ఏకంగా 14 రోజుల పాటు కలిసికట్టుగా, నిర్విరామంగా వేట సాగించింది. చివరికి శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో మూసా ముఠా ఆనుపానులు కనిపెట్టి ముప్పేట దాడి చేసింది. రెప్పపాటులో దాని కథ ముగించింది. జమ్మూ కశ్మీర్‌లోని లిడ్వాస్ ప్రాంతంలోని చినార్ కార్ప్స్ సైనిక విభాగం ఈ ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించింది. అనంతరం ఘటనా స్థలిలో తీసిన డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. అందులో ముగ్గురు ముష్కరుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీరంతా లష్కరే, పాక్‌కే చెందిన మరో ఉగ్ర ముఠా జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులేనని తేలింది. పహల్గాం ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే ప్రకటించుకోవడం తెలిసిందే. ఈ ముగ్గురిలో ముఖ్యుడైన మూసా దాడి సమయంలో తీరిగ్గా కునుకు తీస్తూ ఉండటం ఈ ఉదంతం మొత్తంలో కొసమెరుపు!అలా ఉచ్చు బిగించారు...నిజానికి ఆపరేషన్ మహదేవ్ రెండు రోజులుగా కొనసాగుతోంది. దట్టమైన దాచిగాం అడవుల లోతట్టు ప్రాంతం నుంచి అందని అనుమానాస్పద సిగ్నల్స్, కమ్యూనికేషన్‌తో బలగాలు అప్రమత్తమ య్యాయి. వాటి ఆధారంగానే అనుమానితుల జాడను కనిపెట్టగలిగాయి. ఆ వెంటనే సైనిక బృందాలు, ప్రత్యేక బలగాలు (ఎలైట్ ఫోర్సెస్) రంగంలోకి దిగి రెండు రోజులుగా పరిసరాలను జల్లెడ పడుతూ వచ్చాయి. ఆ క్రమంలో ఒక చెట్టు కింద తాత్కాలిక గుడారంలో విశ్రమిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను యాదృచ్చికంగా గుర్తించాయి. దాడిని ఏ మాత్రమూ ఊహించని ముష్కరులు టెంట్లో తీరిగ్గా కునుకు తీస్తూ కనిపించారు. సైనికులు వెంటనే తూటాల వర్షం కురిపించి వారిని హత మార్చారు. ఆపరేషన్‌ను పర్యవేక్షించిన అత్యున్నత స్థాయి అధికారి ఒకరు ఈ మేరకు ధ్రువీకరించారు.రూపం మార్చుకున్న మూసాఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా దళాలకు చిక్కొద్దనే ఉద్దేశంతో మూసా తన రూపాన్ని వీలైనంతగా మార్చుకున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ క్రమంలో అతడు భారీగా బరువు కోల్పోయాడన్నారు. పహల్గాం దాడిలో పాల్గొంది ఈ ఉగ్రవాదులే.. మూసా(కుడివైపు చివర)అలాగే.. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తెలియజేస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ములనార్, హర్వాన్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు సమాచారం. OP MAHADEVContact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025