
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు చర్చ సాగుతోంది. ఆపరేషన్ మహాదేవ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. పాక్ రెచ్చిపోయి సరిహద్దులో హిందూ ఆలయాలు, సామాన్యులను టార్గెట్ చేసిందని.. ఆపరేషన్ మహాదేవ్‌తో పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన వెల్లడించారు.
పహల్గామ్‌లో కుటుంబ సభ్యుల ముందే చంపేశారు. టెర్రరిస్టులు ఉగ్రదాడి తర్వాత పాక్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ సరిహద్దు దాటేందుకు అవకాశం ఇవ్వలేదు. నిన్న జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ మహాదేవ్ జరిగింది. ఆపరేషన్ మహాదేవ్‌లో సులేమాన్ మూసా హతమయ్యాడు. ముగ్గురిలో ఒకరు ఎల్‌ఈటీ ఉగ్రవాది సులేమాన్‌గా గుర్తించాం. ఈ సులేమాన్ పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
‘‘చిదంబరం ప్రూప్ ఏంటి అని అడుగుతున్నారు. ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గురు పాక్‌కు చెందిన వారు. ఉగ్రవాదులు దగ్గర పాక్‌లో తయారైన చాకెట్లు దొరికాయి. ఆ ముగ్గురి ఉగ్రవాదుల ఓటర్ వివరాలూ ఉన్నాయి. చిదంబరం పాక్‌కు క్లీన్‌చిట్ ఎందుకుఇచ్చారు?’’ అంటూ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గామ్ టెర్రిస్టులను మట్టుబెడితే విపక్షాలు సంతోషిస్తాయని అనుకున్నా.. కానీ చూస్తుంటే విపక్షాలు హ్యాపీగా లేవనిపిస్తోంది. పాక్‌ను రక్షిస్తే చిదంబరానికి వస్తుంది? అంటూ అమిత్‌షా మండిపడ్డారు.
కమ్యూనికేషన్ డివైజ్‌ను ట్రాక్ చేయడంద్వారా ఉగ్రగుట్టును పసిగట్టాయి. జమ్మూకశ్మీర్ ోలీసులు, సీఆర్‌పీఎఫ్, పారామిలటరీ కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇది మోదీ సర్కార్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. యూపీఏ హయాంలో తప్పించుకున్న ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రవాదులు ప్రాణాలతో దేశం వెళ్లరని ఆ మరుసటి రోజే చెప్పాం’’ అని అమిత్‌షా గుర్తు చేశారు.