
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు వైఎస్సార్‌సీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో అపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ చర్యలకు జవాబు దారి చేయాలి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హకీమ్ స్వయంగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతిస్తున్నామని చెప్పాడు. వైఎస్సార్‌సీపీ జమ్మూ కాశ్మీర్ పౌరులకు సంఘీభావం ప్రకటిస్తోంది. అనేక సంవత్సరాల అస్థిర పరిస్థితుల మధ్య మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతోంది. పహల్గాం దాడితో ఈ ప్రయత్నాలకు కొంత దెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ అద్భుతంగా నిర్వహించిన భారత ఆర్మీని వైఎస్సార్‌సీపీ అభినందిస్తోంది.
ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యానికి ఒక ప్రతీక. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. అత్యంత ఖచ్చితత్వంతో సైనిక బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రస్తావరాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి జరిగింది. అరగంటలోపే మొత్తం ఆపరేషన్ పూర్తి చేశారు. డ్రోన్ సిస్టంలతో వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయవంతంగా పూర్తి చేసింది. సంఖ్యాత్మక బలం కంటే సాంకేతికత ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పింది. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తతతో సన్నద్ధంగా ఉండడం కీలకం. జాతీయ సార్వభౌమత్వాన్ని రక్షించడానికి రక్షణ బడ్జెట్‌ను పెంచడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సిందూర్ చర్చలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్
పహల్గాం దాడి జరిగిన రోజు, కాల్పుల విరమణ జరిగిన రోజు ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను తోసి పుచ్చారు.ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. స్వయంగా పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణ చేయాలని అడిగారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను సృష్టించినది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలోనే చైనాకు కాశ్మీర్ భూభాగం ధారా దత్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పాకిస్తాన్ చైనా కారిడార్ ఒప్పందాలు జరిగాయి.
ఎంపీ గౌరవ్ గొగోయ్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌పై భారత్ కాల్పుల విమరణకు ఎందుకు అంగీకరించిందో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాకుండా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు.
భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా ఇరు దేశాలపై తాను ఒత్తిడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26సార్లు పాకిస్తాన్‌లను కాల్పుల విరమణకు బలవంతం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు మాట్లాడారు. దీని వెనుక ఉన్న నిజం మాకు తెలుసుకోవాని అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సహాయం అందించకుండా భారత్ ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు.
పహల్గాం ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టకపోవడం,పాక్‌కు బుద్ధి చెప్పామంటూనే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయడం వంటి అంశాలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీటుగా బదులిచ్చారు.
‘ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం అంతే. పాక్, పాక్ ఆక్రమిత ఉగ్రవాదుల ఏరివేతే లక్క్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం మన కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ సైనికులు సింహాలు. దేశ రక్షణ సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసే విషయంలో జాగ్రతగా ఉండాలి’ అంటూ ప్రతిపక్షాలకు రాజ్‌నాథ్ సూచించారు.
ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ప్రభుత్వానికి అడగడం ప్రతిపక్షం పని. కొన్నిసార్లు, మన విమానాలను ఎన్ని కూల్చివేసారని మన ప్రతిపక్ష సభ్యులు అడుగుతూనే ఉంటారు. కానీ మన దళాలు ఎన్ని పాకిస్తాన్ విమానాలను కూల్చివేశామని వారు ఎప్పుడూ అడగరు. మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే, ఈ ఆపరేషన్‌లో మన సైనికుల్లో ఎవరికైనా హాని జరిగిందా అని అడగండి? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా? లేదు’ అని అన్నారు.
సోమవారం (జులై 28)లోక్‌సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య.ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం.ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చంపారు మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఊరుకునేది లేదు. పాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాం. భారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది. పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. 100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం.
హిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాం.టెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాం.పాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం.పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసింది. పాక్‌లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాం.ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్.
పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు.భారత నౌకా దళం కూడా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది.పాక్‌ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరింది.మన దాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..గ్యాప్ ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.బాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు.