
విజయ్΄పాల్ రెడ్డి, మోహన్, వశిష్ట, సత్యరాజ్
‘‘నా వయసు డెబ్బై ఏళ్లు దాటింది. నా కెరీర్‌లో ఎన్నో ఫాదర్ రోల్స్, విలన్ రోల్స్ చేశాను. ఇకపై ఆ తరహా రెగ్యులర్ పాత్రలు కాకుండా ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రంలో నేను చేసిన వైవిధ్యమైన, కొత్త తరహా పాత్రలు చేస్తాను. నా ఫ్రెండ్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా మా చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని నటుడు సత్యరాజ్ అన్నారు.
ఆయన ప్రధాన పాత్రధారిగా, వశిష్ట ఎన్ .సింహా, ‘సత్యం’ రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు మేకర్స్.
ఉదయభాను మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో ఒక సవాల్‌తో కూడిన పాత్ర చేశాను’’ అని చెప్పారు. ‘‘నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు వశిష్ట సింహా. ‘‘క్లారిటీ, కమిట్‌మెంట్, కంటెంట్‌తో మేం చేసిన సినిమా ఇది’’ అని తెలిపారు మోహన్ శ్రీవత్స. ‘‘మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి’’ అన్నారు విజయ్‌పాల్ రెడ్డి అడిదెల.