
త్రిబాణధారి బార్బరిక్( Tribanadhari Barbarik) సినిమా చుట్టూ చాలా ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ విడుదల తర్వాత ఎవరూ చూడలేదని ఆ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. తన కష్టానికి తగిన ఫలితం దక్కలేదని మీడియా ముందే చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఈ మూవీ గురించి వైరల్ అయింది. ఆపై సినిమా ఫలితం చూసి ఉదయభాను కూడా గుక్కపెట్టి ఏడ్చింది. ఇలా త్రిబాణధారి బార్బరిక్ చుట్టూ అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఓటీటీలోకి రానున్నండంతో నెటిజన్లు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
‘త్రిబాణధారి బార్బరిక్’.. సన్ నెక్స్ట్(Sun NXT)లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా విడుదల కానుందని ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించారు.

కథేంటంటే..
ప్రముఖ సైకాలజిస్ట్ శ్యామ్ కతు(సత్యరాజ్) మనవరాలు నిధి(మేఘన) కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసుని కానిస్టేబుల్ చంద్ర(సత్యం రాజేశ్) డీల్ చేస్తుంటాడు. మరోవైపు మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్(వశిష్ట సింహా) విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. దానికోసం రూ.30 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. తన స్నేహితుడు, లేడీ డాన్ వాలికి పద్మ(ఉదయ భాను) మేనల్లుడు దేవ్(క్రాంతి కిరణ్)తో కలిసి ఇష్టం లేకపోయిన కొన్ని అసాంఘీక పనులు చేస్తుంటాడు.
దేవ్‌కి జూదం అంటే పిచ్చి. అత్త వాకిలి పద్మకు తెలియకుండా డ్రగ్స్ మాఫియా లీడర్ దాస్(మొట్ట రాజేంద్రన్) దగ్గర లక్షల్లో అప్పు చేసి జూదంలో పొగొట్టుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత దాస్ తన అప్పు తీర్చమని దేవ్‌పై ఒత్తిడి చేస్తాడు. దీంతో డబ్బు కోసం రామ్ ఓ ప్లాన్ వేస్తాడు. అదేంటి? నిధి మిస్సింగ్‌కి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు నిధిని కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? మనవరాలి కోసం శ్యామ్ ఏం చేశాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే.