
బిగ్‌బాస్ షో హడావుడి ప్రస్తుతం నడుస్తోంది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ అవుతోంది. హిందీలోనూ కొన్ని వారాల క్రితమే 19వ సీజన్ మొదలైంది. అయితే లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ వస్తున్నట్లు చూపించారు. దీంతో చాలామంది షాకయ్యారు. తీరా చూస్తే ఇతడి సోదరి మాలతి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ మాలతి సంగతేంటి?
ఉత్తరప్రదేశ్‌కి చెందిన దీపక్ చాహర్.. ఐపీఎల్‌లో చెన్నై జట్టుకి ఆడినప్పుడు చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై టీమ్‌కి ఆడుతున్నాడు. అయితే లేటెస్ట్‌గా ప్రసారమైన హిందీ బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో తొలుత ఇతడు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన సోదరిని సపోర్ట్ చేసేందుకు వచ్చానని చెప్పడంతో రిలాక్స్ అయ్యారు.
(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)
రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా మాలతి చాహర్.. బిగ్‌బాస్ 19లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు దీపక్ చాహర్ అక్కగా తనకు గుర్తింపు ఉందని, ఈ షోలో ఆడి సొంత గుర్తింపు తెచ్చుకోవాలనేది తన ప్రయత్నమని చెప్పుకొచ్చింది. మాలతి విషయానికొస్తే.. ఇంజనీరింగ్ చదివినప్పటికీ మోడలింగ్ వైపు వచ్చింది. పలు ఫ్యాషన్ పోటీల్లోనూ పాల్గొంది. 2014లో ఫెమినా మిస్ ఇండియా ఢిల్లీ రెండో రన్నరప్‍గా నిలిచింది. అయితే 2019లో ఐపీఎల్ సందర్భంగా చెన్నై జట్టుకు చీర్స్ చెబుతూ కెమెరా కంటపడి సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది.
2018లో 'జీనియస్' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సదా వియా హోజీ, మా ఓ మేరీ మా తదితర చిత్రాల్లోనూ నటించింది. ఓవైపు నటిస్తూనే మరోవైపు దర్శకత్వం, నిర్మాణ రంగల్లోనూ ప్రవేశించింది. 'ఓ మారీ' అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. ఇన్ స్టాలోనూ ఈమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. మరి బిగ్‌బాస్ షోతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?)