
బిగ్‌బాస్ 9వ సీజన్ ఐదోవారంలోకి అడుగుపెట్టేసింది. గతవారం మాస్క్ మ్యాన్ హరీశ్ ఎలిమినేట్ అయిపోయాడు. చెప్పాలంటే తొలివారం అనుహ్యంగా శ్రష్ఠి వర్మ బయటకు రాగా.. తర్వాత నుంచి వరసగా మనీష్, ప్రియ, హరీశ్ ఇలా అందరూ కామనర్స్ ఎలిమినేట్ అవుతు వచ్చారు. దీంతో ఈసారి కూడా వీళ్లలో నుంచే ఒకరు బయటకొస్తారా లేదంటే సెలబ్రిటీల నుంచి వస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంట్‌గా జరిగింది.
కెప్టెన్ అయిన రాము తప్పించి మిగిలిన అందరూ అంటే భరణి, సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, పవన్, కల్యాణ్, శ్రీజ, తనూజ, నికిత నామినేట్ అయినట్లు ప్రకటించిన బిగ్‌బాస్.. చిన్నపాటి షాకిచ్చాడు. అయితే లిస్ట్ నుంచి బయటకొచ్చేందుకు ఇమ్యూనిటీ పొందాల్సి ఉంటుందని చెప్పాడు. అలా తొలుత బెడ్ గేమ్ పెట్టాడు. బెడ్‌పై అందరూ ఉంటారు. వీళ్లలో ఒక్కొక్కరిని కిందరు తోసేయాల్సి ఉంటుంది. అలా చివరకు మిగిలిన వాళ్లతో మరో గేమ్ ఆడించారు.
(ఇదీ చదవండి: క్లీంకార ముఖాన్ని దాచిపెట్టడానికి కారణమదే: ఉపాసన)
నీరు, నిప్పు, గాలి అంటూ మరో ఇమ్యూనిటీ టాస్క్ ఆడించారు. ఈ పోటీలో ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, భరణి, తనూజ పాల్గొన్నట్లు ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఇలా గేమ్స్ ఆడించగా చివరగా ఇమ్మాన్యుయేల్ విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ రాము, ఇమ్ము తప్పితే మిగిలిన వాళ్లంతా ఈసారి నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది.
ఎందుకంటే ఈ వీకెండ్.. పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా రాబోతున్నారని సమాచారం. వీళ్లలో అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేమ్ రమ్య, సీరియల్ నటి సుహాసిని తదితరుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే రెండు మూడు రోజుల్లో ఫైనల్ ఎంట్రీస్ ఎవరనేది ఓ క్లారిటీ వస్తుంది.
(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)