
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిత్రమండలి'. అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది. కొన్నాళ్ల క్రితం రిలీజైన టీజర్, పాటలు ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. నిర్మాత బన్నీ వాస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)
ట్రైలర్ చూస్తుంటే ఫన్నీగా ఉంది. 'జాతిరత్నాలు' తరహాలో నవ్వించడమే మూవీ టీమ్ లక్ష‍్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. వెన్నెల కిశోర్, సత్య తదితరులు కూడా కామెడీతో నవ్వించేలా కనిపిస్తున్నారు. దీపావళి బరిలో 'మిత్రమండలి'తో పాటు కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్', సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్.. బిగ్‌బాస్‌లోకి టీమిండియా స్టార్ బౌలర్?)