ఫీల్‌ గుడ్‌ షురూ | Ram Pothineni and Bhagyashri Borse New Movie Launch | Sakshi
Sakshi News home page

ఫీల్‌ గుడ్‌ షురూ

Nov 22 2024 1:41 AM | Updated on Nov 22 2024 1:41 AM

Ram Pothineni and Bhagyashri Borse New Movie Launch

రామ్‌ పోతినేని హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి  సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్‌ మలినేని కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్‌ ఇచ్చారు.

 దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్‌ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్‌ సాధినేనిలు దర్శకుడు మహేశ్‌కు స్క్రిప్ట్‌ అందజేశారు. ‘‘యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కనున్న సినిమా ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement