మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse) జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత(Kaantha Movie). ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌ను డేట్‌ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 6న కాంత ట్రైలర్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు.
THE FIRST SPARK (Tamil) - OUT NOW!💥
TRAILER ON NOV 6th!⚡️https://t.co/FV0u8YSzdk
A @SpiritMediaIN and @DQsWayfarerFilm
production#Kaantha #DulquerSalmaan #RanaDaggubati #SpiritMedia#DQsWayfarerfilms #Bhagyashriborse#SelvamaniSelvaraj #Kaanthafilm#KaanthaFromNov14…— Wayfarer Films (@DQsWayfarerFilm) November 4, 2025


