breaking news
kaantha Movie
-
'కాంత' సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్
పాన్ ఇండియా రేంజ్లో ‘‘కాంత’ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన బాగానే వస్తుంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తన కెరీర్లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారు. భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది. సెల్వమణి సెల్వరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలకపాత్రలుపోషించారు. దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అయింది. మొదటిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు.కాంత చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తమిళ విమర్శకుల నుండి చాలా సానుకూల సమీక్షలు వచ్చాయి. కానీ, తెలుగు సమీక్షలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్లో కాంత సినిమా నిరాశపరిచే విధంగా ఉందంటూ ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎం.కె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా కాంత సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారని త్యాగరాజ భాగవతార్ మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ (64) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీంతో న్యాయస్థానం కూడా ఆ పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని దుల్కర్ సల్మాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చింది. A SENSATIONAL START ❤🔥KAANTHA sparks electrifying collections on DAY 1 🔥In cinemas now. Book your tickets! 🎟https://t.co/PMoP2b2FRDA @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #Kaanthafilm #Kaanthafilmfrom14th@dulQuer @RanaDaggubati… pic.twitter.com/HhbddOlVHr— Wayfarer Films (@DQsWayfarerFilm) November 15, 2025 -
‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
-
‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
నా యాక్టింగ్‌పై నాకే డౌట్: దుల్కర్ సల్మాన్
కొంతమంది నటులకు వంక పెట్టాల్సిన పనుండదు. సినిమా బాగున్నా, బాలేకపోయినా వారి నటన మాత్రం అద్భుతం అనేలా ఉంటుంది. అలాంటి నటుడే దుల్కర్ సల్మాన్. మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరపై అడుగుపెట్టిన దుల్కర్.. తక్కువకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగువారికి సైతం దగ్గరయ్యాడు. ఆ విమర్శలు చూస్తుంటా..దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దుల్కర్ ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతూ.. నేను గొప్ప నటుడినని అనుకోవడం లేదు. నేను సరిగా యాక్ట్ చేయలేనని విమర్శించే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వారి కామెంట్స్ చదివినిప్పుడు నాపై నాకే అనుమానం వేస్తుంది. వెంటాడే భయంనిజంగా నేను బాగా నటించడం లేదా? అని చిన్న భయం వెంటాడుతుంది. ఆ భయమే నన్ను మరింత కష్టపడేలా చేస్తుంది. ఇంకా కఠినమైన పాత్రలు ఎంపిక చేసుకునేందుకు దోహదపడుతుంది. కొన్ని సినిమాలు చేసినప్పుడు.. ఆయా పాత్రల్లో నేను తప్ప మరే నటుడూ ఇమడలేడు అని జనం అనుకునేలా చేయాలని మరింత కసిగా కష్టపడతాను అని చెప్పుకొచ్చాడు.సినిమాదుల్కర్ సల్మాన్.. 2012లో సెకండ్ షో సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. చార్లీ, మహానటి, కురుప్, సీతారామం వంటి చిత్రాలతో స్టార్ హీరోగా విశేష ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో ఆకాశంలో ఒక తార సినిమా ఉంది. అలాగే పూజా హెగ్డేతో ఓ మూవీ చేస్తున్నాడు. అలాగే తన చేతిలో మరో మలయాళ సినిమా కూడా ఉంది.చదవండి: కాంత మూవీ రివ్యూ -
‘కాంత’ మూవీ రివ్యూ
‘మహానటి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంత’. సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 1950 బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్టార్ హీరో- దర్శకుడి చుట్టూ తిరుగుతుంది. అయ్య(సముద్రఖని) ఓ గొప్ప సీనీ దర్శకుడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శాంత’. ‘నట చక్రవర్తి’ టీకే మహదేవన్ అలియాస్ టీకేఎం(దుల్కర్ సల్మాన్) హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ కథను టీకే మహదేవన్‌తోనే తెరకెక్కించాల్సి వస్తుంది. అయ్యకు ఇష్టంలేకపోయినా..ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు. కానీ టీకేఎం ఈ సారి ఈ కథ క్లైమాక్స్‌ని మార్చి దానికి ‘కాంత’(Kaantha Review) అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తాడు. అంతేకాదు అయ్యను కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లుగా సినిమాను తీస్తుంటాడు. ఇందులో కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ) హీరోయిన్. ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా అయ్యనే. అటు హీరో, ఇటు దర్శకుడి మధ్య ఈగో వార్ జరుగుతున్నప్పటీకీ..సినిమా షూటింగ్ మాత్రం ఆగదు. చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలి ఉండగా..హీరో-దర్శకుడి మధ్య గొడవ జరిగి షూటింగ్ ఆగిపోతుంది. అదే రోజు స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. అది ఎవరిది? ఎందుకు చేశారు? గురు శిష్యులైన అయ్య, టీకేఎం మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయి? వీరిద్దరి ఈగోల కారణంగా కుమారికి జరిగిన నష్టం ఏంటి? స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీసు అధికారి ఫీనిక్స్(రానా) ఎలా సాల్వ్ చేశాడు?అనేది తెలియాలంటే సినిమా(Kaantha Review) చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇది కల్పిత కథ అని చెప్పినప్పటీకీ..1934-59 మధ్యకాలంలో తమిళంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటలను ఈ సినిమాలో కనిపిస్తాయి. ఈగోతో ఓ దర్శకుడితో గొడవపడడం.. జైలుకు వెళ్లడం.. ఇవన్నీ ఎంకేటీ నిజజీవితంలో జరిగాయి. దర్శకుడు సెల్వరాజ్ ఈ ప్రధాన అంశాలకు కాస్త ఫిక్షనల్ స్టోరీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్‌ని తెరపై చూపించడం అంత ఈజీ కాదు. సినిమాలోనే ఓ సినిమా చూపించాలి. అదీ కూడా బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి కథ. టెక్నికల్‌గా ఇది కష్టమైనప్పటీకీ.. తెరపై మాత్రం చాలా చక్కగా చూపించారు. ఆ కాలంనాటి సంగీతం, ఆర్ట్‌వర్క్, కలర్ టోన్.. ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుడు అప్పటి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు. ఈ విషయంలో దర్శకుడితో పాటు టెక్నికల్ టీమ్‌ని కూడా అభినందించాల్సిందే. కానీ ఈ కథను ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా రూపొందించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్.. సినిమా సంబంధిత వర్గాలను మాత్రమే ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ మొత్తం షూటింగ్ సమయంలో దర్శకుడికి, హీరోకి మధ్య గొడవలు.. వారి ఈగోల వల్ల కింది స్థాయి సిబ్బంది పడే ఇబ్బందులు.. హీరో-హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టూనే కథనం సాగుతుంది. దర్శకుడి- హీరోకి మధ్య విబేధాలు రావడానికి గల కారణం ఏంటనేది పూర్తిగా చెప్పకుండా..అక్కడక్కడ కొన్ని సీన్లను మాత్రమే చూపించడంతో అసలు వీళ్ల మధ్య ఏం జరిగి ఉంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితాయార్థం మొత్తం హత్య కేసు చుట్టూనే తిరుగుతూ..ఓ సాధారణ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పోలీసాఫీసర్‌గా రానా ఎంట్రీ ఇవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తుంది. ఈ కథ 1950 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్నప్పటికీ.. రానా ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం కాలాన్నే గుర్తు చేస్తుంది. ఇన్వెస్టిగేషన్లో బయటపడే చిన్న చిన్న ట్విస్టులు కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది. హంతకుడు ఎవరనేది ముందే ఊహించినా.. ఎందుకు చేశాడనేది మాత్రం గెస్ చేయలేం. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. దుల్కర్ నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు. అందులోనూ పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్ పాత్రల్లో అయితే జీవించేస్తాడు.1950లలో నాటి సూపర్ స్టార్ టీకే మహాదేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కొన్ని సీన్లను చూస్తే.. ఇది దుల్కర్ తప్ప మరే నటుడు చేయలేడు అన్నంతగా ఆయన ఫెర్మార్మెన్స్ ఉంది. దుల్కర్‌తో పోటీపడి నటించారు సముద్ర ఖని, భాగ్యశ్రీ. సముద్రఖని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెర్మార్మెన్స్గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు. తెరపై డైరెక్టర్ అయ్య మాత్రమే కనిపిస్తాడు తప్పితే సముద్రఖని కనిపించడు. ఇక భాగ్యశ్రీ కూడా అంతే. ఇంతవరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైన భాగ్యశ్రీ.. ఈ చిత్రంతో నటన పరంగానూ ఆకట్టుకుంది. నటి కుమారి పాత్రలో జీవించేసింది. రానా తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. జాను చాంతర్ పాటలు బాగున్నాయి. కథతో భాగంగా ఈ పాటలు వస్తుంటాయి తప్పితే..ఎక్కడా ఇరికించినట్లుగా అనిపించవు. డాని సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటి టైంని రీ క్రియేట్ చేయడంలో తన కెమెరా పనితనాన్ని చూపించాడు. సినిమా చూస్తున్నంత సేపు అప్పటి రోజుల్లోకి వెళతాం. ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత షార్ప్‌గా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
14 సినిమాల్లో 10 బ్లాక్ బస్టర్స్.. 49 ఏళ్లకే మృతి.. ఎవరీ సూపర్ స్టార్?
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరు స్టార్ అవుతారు..ఎవరు జీరో అవుతారో ఊహించలేం.డబ్బు, ఫేమ్ ఎలా వస్తుందో, ఎలా పోతుందో ఎవరూ అంచనా వేయలేం. స్టార్ అవ్వడానికి ఎంత కష్టపడాలో ఆ స్టార్‌డమ్‌ని కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. ఒక చిన్నతప్పు చాలు ‘స్టార్’ని కాస్త జీరో చేయడానికి. ఉన్న ఫేమ్ పోయిన తర్వాత మళ్లీ తిరిగి తెచ్చుకోవడం కష్టం. రాలేదు కూడా. అలా ఓ వ్యక్తి తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది.. ఈగోతో గొడవలకు పోయి ఉన్న పేరుని కాస్త చెడగొట్టుకోవడమే కాదు.. హత్య కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు.అంతేకాదు 49 ఏళ్లకే తన జీవితానికి ‘శుభం’ కార్డు వేసుకున్నాడు. ఆయనే ఎంకే త్యాగరాజ భాగవతార్ అలియాస్ ఎంకేటీ.14 సినిమాల్లో 10 బ్లాక్ బస్టర్స్ఈ తరం ప్రేక్షకులకు ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్. ఆయన నటించిన 14 చిత్రాలలో 10 సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి.ఆయన నటించిన హరిదాస్ వంద వారాలకు పైగా ఆడిందట. ఎంకే త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్. అభిమానులు ముద్దుగా ఎంకేటీ అని పిలుస్తారు. 1910లో పుట్టిన త్యాగరాజన్ది పేద కుటుంబం. కర్ణాటక సంగీత గాయకుడుగా పేరు సంపాదించింది తర్వాత సినిమాల్లోకి వచ్చాడు.1934-59 మధ్యకాలంలో 14 సినిమాల్లో హీరోగా నటిస్తే.. అందులో 10 భారీ విజయం సాధించాయి. దీంతో ఆయనకు సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది. 1940 ప్రాంతంలోనే మెర్సీడెస్ బెంజ్‌లో తిరగడమే కాక.. బంగారు పళ్లేల్లో భోజనం చేసేవాడట.హత్యకేసులో జైలుకు..స్టార్ హీరోగా మారిన తర్వాత ఎంకేటీ ప్రవర్తలో మార్పు వచ్చింది. ఓ ప్రముఖ దర్శకుడితో వివాదం ఎంకేటీ జీవితాన్ని తలకిందులు చేసిందట. ఈగోతో ఆ దర్శకుడితో గొడవపడడంతో తర్వాత అవకాశాలు తగ్గిపోయాయట. ఆ సమయంలోనే జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఆయనను ఇరికించడంతో రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అవకాశాలు రాలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన అవకాశాల కోసం చాలా ప్రయత్నాలే చేశాడట. చివరకు అనారోగ్య భారిన పడి 1959 నవంబర్ 1వ 49 ఏళ్లకే కన్నుమూశారు.‘కాంత’ ఈ హీరో కథేనా?దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంతా’. రానా దగ్గుబాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే..ఇది ఎంకేటీ బయోపిక్లాగే అనిపిస్తుంది. ఇందులో ఎంకేటీ పాత్రలో దుల్కర్ నటించగా.. ఆయన పతనానికి కారణం అయిన దర్శకుడి పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇది ఎంకేటీ బయోపిక్ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. -
కుమారిని సవాల్‌గా తీసుకున్నాను!
‘‘తెలుగులో నేను విన్న తొలి స్క్రిప్ట్, ఒప్పుకున్న సినిమా ‘కాంత’. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ కాస్త ఆలస్యంగా మొదలైంది. ఆ గ్యాప్‌లో ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ సినిమాలు చేశాను. ‘కాంత’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. పూర్తి స్థాయిలో నటనకి అవకాశం ఉన్న కుమారి పాత్రను ఈ చిత్రంలో చేశాను’’ అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చెప్పారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్ర ఖని కీలక పాత్రలు చేశారు.రానా, దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘నాలాంటి కొత్త అమ్మాయికి ‘కాంత’లో కుమారిలాంటి పాత్ర దొరకడం అదృష్టం. సవాల్‌గా తీసుకుని ఈ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం శ్రీదేవి, సావిత్రిగార్ల నటనని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఇప్పటివరకు నన్ను కమర్షియల్ నటి అన్నారు. ‘కాంత’ తర్వాత గొప్ప నటి అంటారని ఆశిస్తున్నా.కుమారి పాత్రని సెల్వరాజ్గారు రాసుకున్న విధానం ఆశ్చర్యపరిచింది. నేను నటించిన ‘కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలు ఒకే నెలలో విడుదలవుతుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. నా వరకు 100 శాతం కష్టపడ్డాను. మంచి ఫలితం దక్కుతుందనే నమక్మకం ఉంది. మంచి కథ కుదిరితే తమిళ్లోనూ సినిమా చేస్తాను. అయితే నా తొలిప్రాధాన్యం తెలుగు సినిమాకే. ప్రస్తుతం కొన్ని తెలుగు, హిందీ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. -
దుల్కర్ సల్మాన్ కాంతా.. రిలీజ్‌కు ముందే వివాదం..!
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)హీరోగా వస్తోన్న తాజా చిత్రం'కాంతా'(Kaantha). ఈ మూవీకి టాలీవుడ్ హీరో దగ్గుబాటి నిర్మించడంతో పాటు కీలక పాత్రలో నటింటారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 14న థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అయితే రిలీజ్‌కు ముందే కాంతా మూవీ ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రముఖ నటుడు, సంగీతకారుడు త్యాగరాజ భాగవతార్ మనవడు త్యాగరాజన్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తాత, దిగ్గజ నటుడు, కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ భాగవతార్‌ను జీవితాంతం పేదరికంలో జీవించిన వ్యక్తిగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. ఆయన చరిత్రను వక్రీకరించేలా తప్పుగా చూపించారని.. త్యాగరాజ భాగవతార్ కీర్తిని అపఖ్యాతి పాలు చేసేలా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఎంకేటీగా ప్రసిద్ధి చెందిన దివంగత భాగవతార్ తమిళ సినిమా, కర్ణాటక సంగీతంలో గౌరవనీయమైన వ్యక్తి అని వెల్లడించారు. ఆయన భక్తి, దాతృత్వానికి ప్రసిద్ధి చెందారని త్యాగరాజన్ పేర్కొన్నారు. ఆయన మరణించే వరకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపారని పిటిషన్లో పేర్కొన్నారు.సినీ నిర్మాతలు ఎవరైనా ప్రజా ప్రముఖులను తెరపై చిత్రీకరించే ముందు వారి వారసుల నుంచి చట్టపరంగా అనుమతి పొందాలని పిటిషనర్ త్యాగరాజన్ తెలిపారు. ఈ విషయంలో 'కాంతా' మూవీ నిర్మాతలు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఈ చిత్రం తన తాత వారసత్వానికి పరువు నష్టం కలిగించేలా ఉందని.. తక్షణమే ఈ సినిమా దాని విడుదలపై నిషేధం విధించాలని కోర్టును కోరారు. అయితే ఈ వివాదంపై నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ కల్పిత కథ అని స్పష్టం చేశారు. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ పీరియాడికల్ డ్రామాలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించగా.. సముద్రఖని కీలక పాత్ర పోషించారు. -
చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)
-
కాంత ట్రైలర్ లాంచ్.. ఒకే వేదికపై దుల్కర్, రానా (ఫోటోలు)
-
ఇక దుల్కర్‌ని నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా
‘‘కాంత’ చిత్రం ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని థియేటర్స్‌లో చూస్తే గొప్ప అనుభూతినిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ఎనర్జీ ఓ రేంజ్లో ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని దుల్కర్ సల్మాన్ చెప్పారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన చిత్రం ‘కాంత’. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో ప్రభాస్ లాంచ్ చేశారు.అనంతరం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ– ‘‘కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు. అలాంటి నేపథ్యంలో సెల్వ చెప్పిన ‘కాంత’ కథ విన్న వెంటనే కచ్చితంగా సినిమా చేయాలనిపించింది. ఈ నెల 14 తర్వాత దుల్కర్‌ని అందరూ నట చక్రవర్తి అని పిలుస్తారు’’ అని చెప్పారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ–‘‘ఇప్పటి వరకు నా సినిమాలు చూశారు. ఈ చిత్రంలో నా నటన చూస్తారు’’ అన్నారు.‘‘కాంత’లో నటించడం గర్వంగా ఉంది’’ అన్నారు సముద్ర ఖని. ‘‘ఈ సినిమా విడుదలైన రోజునే మీ అందరితో కలిసి సినిమా చూడాలని ఉంది’’ అని సెల్వమణి సెల్వరాజ్ తెలిపారు. ‘‘ఈ చిత్రానికి ప్రాణంపోసి మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అని ప్రశాంత్ పొట్లూరి పేర్కొన్నారు. -
రానాకు నేను నచ్చలేదు.. భాగ్యశ్రీ బోర్సే షాకింగ్ కామెంట్స్!
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'కాంతా'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషించారు. నవంబరు 14న మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కింగ్డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ ఆడిషన్ కోసం చెన్నైకి వెళ్లానని తెలిపింది. అయితే రానాకు నా లుక్ టెస్ట్ నచ్చలేదని భాగ్యశ్రీ బోర్సే తెలిపింది. అమ్మాయి భాగ్య చాలా బాగుంది.. కానీ యాక్టింగ్ పరంగా తెలియదు అని రానా అన్నారు. కానీ డైరెక్టర్ సెల్వరాజ్ నాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని తెలిపింది. లుక్ టెస్ట్, డైలాగ్స్ చెప్పిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారని భాగ్యశ్రీ బోర్సే వెల్లడించింది. ఈ మాటలు విన్న రానా.. ప్రతిసారీ నెేను విలన్ ఎందుకవుతానో నాకె తెలియదంటూ నవ్వుతూ అన్నారు. -
దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ రిలీజ్
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'కాంత'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా ఇండస్ట్రీ గురించి ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు 14న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తెలుగు, తమిళ ట్రైలర్స్ ఒకేసారి రిలీజ్ చేశారు.లెక్క ప్రకారం సెప్టెంబరులోనే ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారు. కానీ అనుకోని కారణాల వల్ల నవంబరులో విడుదల చేస్తున్నారు. తొలుత ఇందులో దుల్కర్ మాత్రమే నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ రానా కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. దుల్కర్-రానా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. -
దుల్కర్ సల్మాన్ కాంత.. ట్రైలర్ ఎప్పుడంటే?
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse) జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత(Kaantha Movie). ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫస్ట్ స్పార్క్ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌ను డేట్‌ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 6న కాంత ట్రైలర్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. THE FIRST SPARK (Tamil) - OUT NOW!💥TRAILER ON NOV 6th!⚡️https://t.co/FV0u8YSzdkA @SpiritMediaIN and @DQsWayfarerFilmproduction#Kaantha #DulquerSalmaan #RanaDaggubati #SpiritMedia#DQsWayfarerfilms #Bhagyashriborse#SelvamaniSelvaraj #Kaanthafilm#KaanthaFromNov14…— Wayfarer Films (@DQsWayfarerFilm) November 4, 2025 -
నవంబర్ బాక్సాఫీస్.. అందరికీ చాలా కీలకం
తెలుగులో చాలావరకు పెద్ద సినిమాలన్నీ పండగల్ని టార్గెట్ చేసుకుని థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ ఏడాదికి అన్ని పండగలు అయిపోయాయి. మిగిలింది క్రిస్మస్ మాత్రమే. దానికి ఇంకా చాలా సమయముంది. నవంబరులో ఎప్పుడూ చెప్పుకోదగ్గ రిలీజులేం ఉండవు. ఈసారి మాత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకుంటాయనే పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ నవంబరులో థియేటర్లలోకి వచ్చే తెలుగు సినిమాలేంటి? వాటి సంగతేంటి?గత రెండు నెలలు (సెప్టెంబరు, అక్టోబరు) టాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడింది. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్ చిత్రాలతో కాస్త హిట్ కళ కనిపించింది. నవంబరులోనూ అలా అరడజనుకు పైగా కాస్త పేరున్న మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో రష్మిక ద 'గర్ల్ ఫ్రెండ్', దుల్కర్ సల్మాన్ 'కాంత', రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి.(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి సర్ప్రైజ్.. జాన్వీ కపూర్ పోస్టర్స్ రిలీజ్) తొలివారంలో రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్' రానుంది. ఇది హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. ఎందుకంటే ఈమె చేసిన తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ట్రైలర్ అయితే డిఫరెంట్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ కలిగించింది. మరోవైపు మహేశ్ బాబు బావమరిది సుధీర్ బాబు 'జటాధర'తో ఈ వారమే రానున్నాడు. ప్రస్తుత ట్రెండ్ అయిన సూపర్ నేచురల్ ఎలిమింట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. ఇది హిట్ కావడం కూడా హీరోకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా సుధీర్ బాబుకి హిట్ లేదు. వీటితో పాటు తిరువీర్ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రం కూడా ఇదే వారం రానుంది.రెండో వారంలో దుల్కర్ సల్మాన్ 'కాంత' వస్తుంది. ఓ దర్శకుడు, హీరో, హీరోయిన్.. వాళ్ల మధ్య ఈగో అనే కాన్సెప్ట్‌తో తీసిన పీరియాడిక్ మూవీ ఇది. గతేడాది 'లక్కీ భాస్కర్' అనే స్ట్రెయిట్ తెలుగు మూవీతో హిట్ కొట్టిన దుల్కర్.. ఈసారి కూడా హిట్ కొడితే టాలీవుడ్లో సెటిలైపోవచ్చు. ఇదే రోజున చాందిని చౌదరి 'సంతాన ప్రాప్తిరస్తు' అనే మూవీ రానుంది. దీనిపై పెద్దగా అంచనాల్లేవు.(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)మూడోవారానికి ప్రస్తుతానికి కొత్త సినిమాలేం షెడ్యూల్ కాలేదు. చివరి వారంలో మాత్రం రామ్ 'ఆంధ్రా కింగ్ తాలుకా' ఒక్కటే రానుంది. మాస్‌ని నమ్ముకుని గత రెండు మూడు మూవీస్‌తో పూర్తిగా నిరాశపరిచిన రామ్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇతడి కోరిక 'ఆంధ్రా కింగ్ తాలుకా'తోనైనా నెరవేరుతుందా అనేది చూడాలి? ఈ చిత్రంతో పాటు 'కాంత'లోనూ భాగ్యశ్రీ బోర్సేనే హీరోయిన్. అంటే రెండు వారాల గ్యాప్‌లో భాగ్యశ్రీ రెండు చిత్రాలతో తన అదృష్టం పలకరించుకోనుంది.పైన చెప్పిన సినిమాలే కాకుండా మోహన్ లాల్ 'వృషభ' (నవంబరు 06), కృష్ణలీల (నవంబరు 7), ప్రేమిస్తున్నా (నవంబరు 07), స్కూల్ లైఫ్ (నవంబరు 14), ధనుష్ హిందీ మూవీ 'తేరే ఇష్క్ మే' (నవంబరు 28) తదితర సినిమాలు కూడా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన) -
దుల్కర్ సల్మాన్ కాంత.. మరో సాంగ్ వచ్చేసింది
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సో జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత. ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన సాంగ్ దుల్కర్ సల్మాన్ అభిమానులను అలరిస్తోంది. ఇంగ్లిష్ లిరిక్స్‌తోపాటు తమిళం, తెలుగు ర్యాప్‌తో కూడిన ఈ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. ఈ సాంగ్‌కు జాను చంతర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. -
దుల్కర్, భాగ్యశ్రీల 'కాంత'.. మెలోడీ సాంగ్ విడుదల
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కాంత... తాజాగా ఈ మూవీ నుంచి 'అమ్మాడివే' అంటూ సాగే రెండో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే వచ్చేసిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను మెప్పించగా.. తాజాగా రిలీజ్ అయిన సాంగ్ మరింత జోష్ నింపేలా ఉంది. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. నవంబర్ 14న పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. -
దుల్కర్ సల్మాన్ థ్రిల్లర్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
గతేడాది లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన కాంత మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా కాంత రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకు దుల్కర్‌తో పాటు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. 1950ల్లో మద్రాసులో జరిగే పీరియాడికల్ హర్రర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఈ కథ ఒక ప్రముఖ చిత్రనిర్మాత రహస్య జీవితం చుట్టే తిరుగుతుంది. ఇటీవల వచ్చిన కొత్త లోకా సూపర్ హిట్ కావడంతోనే కాంతను వాయిదా వేశారు. వచ్చేనెలలో విడుదల చేయనున్నారు. Diwali just got a whole lot more explosive!💥#Kaantha will be lighting up theatres worldwide from NOVEMBER 14th!⚡Wishing you all a happy Diwali and we’ll see you in the theatres very soon.✨❤A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #DulquerSalmaan… pic.twitter.com/dJqhbA5uev— Rana Daggubati (@RanaDaggubati) October 20, 2025 -
కాంత వాయిదా
‘కాంత’ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా సముద్ర ఖని ఓ కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ పేర్కొంది. కానీ ఆ తేదీకి విడుదల చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని గురువారం చిత్రయూనిట్ ఓ నోట్‌ను విడుదల చేసింది. ‘‘కాంత’ సినిమా టీజర్ విడుదలైనప్పట్నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆ ప్యాయత, మద్దతు మా హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ‘కాంత’ చిత్రం యూనిట్ పేర్కొంది. -
Bhagyashri Borse: ‘కాంతా’తో వెలిగిపోతుందా?
ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహిస్తుంది సినిమా. ముఖ్యంగా నటీమణులకు అవకాశాలు తలుపుతడతాయి. అందుకు కొంచెం అందం, కాస్త అదృష్టం ఉంటే చాలు, ఇండియన్ సినిమానే ఏలేయవచ్చు. అలా యువ కథానాయకి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్‌పై కన్నేశారనే చెప్పవచ్చు. 26 ఏళ్ల ఈ మహారాష్ట్రీ పరువాల బ్యూటీ 2023లోనే నటిగా తెరంగ్రేటం చేశారు. అలా ముందుగా హిందీలో నటించిన భాగ్యశ్రీ బోర్సేకు వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ రవితేజకు జంటగా మిస్టర్ బచ్చన్ నటించారు. ఈ చిత్రం విజయాన్ని సాధించకపోకపోయినా ఈ అమ్మడు మాత్రం డాన్స్, అందాలారబోతలతో పాపులర్ అయ్యారు. తరువాత కింగ్డమ్లో విజయ్ దేవరకొండ సరసన నటించారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కాంతా అనే బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్సల్మాన్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా సంస్థ, వేఫారర్ ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాంతా చిత్రం కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రతిభావంతులైన చిత్ర టీమ్‌తో కలిసి నటిస్తున్న కాంతా వంటి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ చిత్రంలోని భాగ్యశ్రీబోర్సే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఈమె గెటప్ పలువురిని ఆకట్టుకుంది. ఈ భామ కోలీవుడ్‌లో ఏమాత్రం రాణిస్తారో వేచి చూద్దాం.


