
గతేడాది లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన కాంత మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా కాంత రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకు దుల్కర్‌తో పాటు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. 1950ల్లో మద్రాసులో జరిగే పీరియాడికల్ హర్రర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఈ కథ ఒక ప్రముఖ చిత్రనిర్మాత రహస్య జీవితం చుట్టే తిరుగుతుంది. ఇటీవల వచ్చిన కొత్త లోకా సూపర్ హిట్ కావడంతోనే కాంతను వాయిదా వేశారు. వచ్చేనెలలో విడుదల చేయనున్నారు.
Diwali just got a whole lot more explosive!💥#Kaantha will be lighting up theatres worldwide from NOVEMBER 14th!⚡
Wishing you all a happy Diwali and we’ll see you in the theatres very soon.✨❤
A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #DulquerSalmaan… pic.twitter.com/dJqhbA5uev— Rana Daggubati (@RanaDaggubati) October 20, 2025