కాంతకు కలిసొచ్చిన వీకెండ్.. మూడు రోజుల్లో ఊహించని కలెక్షన్స్! | Dulquer Salmaan Kaantha collections in just 3 days of release | Sakshi
Sakshi News home page

Kaantha collections: దుల్కర్ సల్మాన్‌ కాంత.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Nov 17 2025 9:12 PM | Updated on Nov 17 2025 9:21 PM

Dulquer Salmaan Kaantha collections in just 3 days of release

దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సో జంటగా వచ్చిన తాజా చిత్రం కాంత(Kaantha collections). పాన్‌‌ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. ఫస్ట్‌ డే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 10.5 కోట్ల గ్రాస్‌  వసూళ్లు రాబట్టింది.

ఇక వీకెండ్‌ కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది.  ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ.24.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. సెల్వమణి సెల్వరాజన్  దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలకపాత్రలుపోషించారు. దుల్కర్‌ సల్మాన్  వేఫేర్‌ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియాపై నిర్మించారు.

తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎం.కె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా కాంత సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారని త్యాగరాజ భాగవతార్‌ మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ (64) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్‌ వేశారు. దీంతో న్యాయస్థానం కూడా ఆ పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని  దుల్కర్ సల్మాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement