దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'కాంతా'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషించారు. నవంబరు 14న మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కింగ్‌డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీ ఆడిషన్ కోసం చెన్నైకి వెళ్లానని తెలిపింది. అయితే రానాకు నా లుక్ టెస్ట్ నచ్చలేదని భాగ్యశ్రీ బోర్సే తెలిపింది. అమ్మాయి భాగ్య చాలా బాగుంది.. కానీ యాక్టింగ్ పరంగా తెలియదు అని రానా అన్నారు. కానీ డైరెక్టర్ సెల్వరాజ్ నాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని తెలిపింది. లుక్ టెస్ట్, డైలాగ్స్ చెప్పిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారని భాగ్యశ్రీ బోర్సే వెల్లడించింది. ఈ మాటలు విన్న రానా.. ప్రతిసారీ నెేను విలన్ ఎందుకవుతానో నాకె తెలియదంటూ నవ్వుతూ అన్నారు.


