దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'కాంత'. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా ఇండస్ట్రీ గురించి ఈ చిత్రంలో సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు 14న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తెలుగు, తమిళ ట్రైలర్స్ ఒకేసారి రిలీజ్ చేశారు.
లెక్క ప్రకారం సెప్టెంబరులోనే ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారు. కానీ అనుకోని కారణాల వల్ల నవంబరులో విడుదల చేస్తున్నారు. తొలుత ఇందులో దుల్కర్ మాత్రమే నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ రానా కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. దుల్కర్-రానా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.


