పాన్ ఇండియా రేంజ్‌లో ‘‘కాంత’ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన బాగానే వస్తుంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తన కెరీర్‌లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారు. భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది. సెల్వమణి సెల్వరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలకపాత్రలుపోషించారు. దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల అయింది. మొదటిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు.
కాంత చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి తమిళ విమర్శకుల నుండి చాలా సానుకూల సమీక్షలు వచ్చాయి. కానీ, తెలుగు సమీక్షలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్‌లో కాంత సినిమా నిరాశపరిచే విధంగా ఉందంటూ ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎం.కె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా కాంత సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారని త్యాగరాజ భాగవతార్ మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ (64) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీంతో న్యాయస్థానం కూడా ఆ పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని దుల్కర్ సల్మాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చింది.
A SENSATIONAL START ❤🔥
KAANTHA sparks electrifying collections on DAY 1 🔥
In cinemas now. Book your tickets! 🎟https://t.co/PMoP2b2FRD
A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #Kaanthafilm #Kaanthafilmfrom14th@dulQuer @RanaDaggubati… pic.twitter.com/HhbddOlVHr— Wayfarer Films (@DQsWayfarerFilm) November 15, 2025


