మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సో జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం కాంత. ఈ మూవీకి సెల్వరాజ్ సెల్వమణి దర్శకత్వం వహించారు. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేశారు.
తాజాగా రిలీజైన సాంగ్ దుల్కర్ సల్మాన్ అభిమానులను అలరిస్తోంది. ఇంగ్లిష్ లిరిక్స్‌తోపాటు తమిళం, తెలుగు ర్యాప్‌తో కూడిన ఈ సాంగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ ఆలపించారు. ఈ సాంగ్‌కు జాను చంతర్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు.


