ఇక దుల్కర్‌ని నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా | Rana Made Interesting Comments At Kaantha Movie Trailer Launch Event, Deets Inside | Sakshi
Sakshi News home page

ఇక దుల్కర్‌ని నట చక్రవర్తి అని పిలుస్తారు: రానా

Nov 7 2025 12:58 AM | Updated on Nov 7 2025 1:00 PM

Rana Speech at Kaantha Trailer Launch Event

ప్రశాంత్‌ పొట్లూరి, సెల్వమణి సెల్వరాజ్, దుల్కర్‌ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా

‘‘కాంత’ చిత్రం ట్రైలర్‌ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని థియేటర్స్‌లో చూస్తే గొప్ప అనుభూతినిస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ఎనర్జీ ఓ రేంజ్‌లో ఉంటుంది. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ రానాతో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని దుల్కర్‌ సల్మాన్‌ చెప్పారు. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన చిత్రం ‘కాంత’. రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని హీరో ప్రభాస్‌ లాంచ్‌ చేశారు.

అనంతరం జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ– ‘‘కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్‌ చేయగలదు. అలాంటి నేపథ్యంలో సెల్వ చెప్పిన ‘కాంత’ కథ విన్న వెంటనే కచ్చితంగా సినిమా చేయాలనిపించింది. ఈ నెల 14 తర్వాత దుల్కర్‌ని అందరూ నట చక్రవర్తి అని పిలుస్తారు’’ అని చెప్పారు. భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ–‘‘ఇప్పటి వరకు నా సినిమాలు చూశారు. ఈ చిత్రంలో నా నటన చూస్తారు’’ అన్నారు.

‘‘కాంత’లో నటించడం గర్వంగా ఉంది’’ అన్నారు సముద్ర ఖని. ‘‘ఈ సినిమా విడుదలైన రోజునే మీ అందరితో కలిసి సినిమా చూడాలని ఉంది’’ అని సెల్వమణి సెల్వరాజ్‌ తెలిపారు. ‘‘ఈ చిత్రానికి ప్రాణంపోసి మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అని ప్రశాంత్‌ పొట్లూరి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement