రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్‌ను గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.
ఈ ఏడాదిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వారణాసికి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను.. ఇది నాలో నటుడి ఆకలి తీర్చిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు..మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.
ప్రకాశ్ రాజ్ రోల్ అదేనా?
అయితే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ రోల్పై టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీలో మహేశ్ బాబు తండ్రిగా కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో ప్రకాశ్ రాజ్ రోల్పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ప్రకాశ్ రాజ్ గతంలో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు చిత్రంలో నటించారు.
Wrapped up a wonderful schedule of #Varanasi .. a joy to the hungry actor within me .. thank you @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @priyankachopra ❤️❤️❤️ it was exhilarating to work with you all .. can’t wait to resume the next schedule 🥰🥰🥰
— Prakash Raj (@prakashraaj) December 23, 2025


