హీరో రవితేజ, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట కాంబినేషన్‌లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ సైన్స్ ఫిక్షన్ కథను రవితేజకు వశిష్ట వినిపించారని, ఈ కథ నచ్చి, సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట వశిష్ట. అలాగే తనకు ‘కిక్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డితోనూ రవితేజ ఓ సినిమాకి చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
ఈ కథ కూడా విన్నారని తెలిసింది. ఇంకా ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వంలోనూ రవితేజ ఓ సినిమా కమిట్‌అయినట్లుగా వార్తలున్నాయి. రవితేజ కొత్త సినిమా కబురు ఏ దర్శకుడితో ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ (వర్కింగ్ టైటిల్)తో రవితేజ బిజీగా ఉన్నారు. అలాగే ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.


