
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కాంత... తాజాగా ఈ మూవీ నుంచి 'అమ్మాడివే' అంటూ సాగే రెండో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే వచ్చేసిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను మెప్పించగా.. తాజాగా రిలీజ్ అయిన సాంగ్ మరింత జోష్ నింపేలా ఉంది. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సముద్రఖని ఓ కీలక పాత్రలో నటించారు. నవంబర్ 14న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.