
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా భారీ అంచనాలతో జూలై 31న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నాగవంశీ నిర్మించారు. అయితే, సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ట్రైలర్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో ప్రసంగించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలాకాలంగా ఆయన భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కింగ్డమ్ విజయం తన కెరీర్కు ఎంత ముఖ్యమో చెబుతూ తన మనసులో మాట ఇలా చెప్పాడు. ' మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను. ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ, వెంకన్నస్వామి దయ, ప్రేక్షకుల ఆశీసులు. ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే' అంటూ ఆయన అన్నారు. సినిమా వేడుక అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీసులు తీసుకున్నాడు. దీంతో విజయ్, భాగ్యశ్రీ, నాగవంశీ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#KINGDOM team Divine Visit to Tirupathi ✨️❤️@TheDeverakonda and team completed Lord Venkateswara Swamy Darshanam in the early hours today 🙏
Gearing up to surprise in theatres on July 31st💥💥#VijayDeverakonda #BhagyashriBorse pic.twitter.com/iLQM5374jB— Eluru Sreenu (@IamEluruSreenu) July 27, 2025