
2025లో ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే ఇంటింటి థియేటర్‌గా అవతరించిన ఓటీటీ రంగం మాత్రం వరుస హిట్‌లు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న సిరీస్‌లతో జోరుగా సాగుతోంది. విశేషం ఏమిటంటే గొప్ప హైప్ ఉత్సాహంతో దూసుకొచ్చిన అనేక సిరీస్‌లు విఫలమైతే, తక్కువ మధ్యస్థపు అంచనాలతో వచ్చిన పలు షోలు వాటి ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకర్షించాయి. అటువంటివాటిలో కొన్ని...

బ్లాక్ వారెంట్... వావ్ కంటెంట్...
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన్ బ్లాక్ వారెంట్ ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదలైన అత్యంత ఉత్కంఠభరితమైన షోలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రై మ్ థ్రిల్లర్ ఇప్పటివరకు లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈ సిరీస్‌లో జహాన్ కపూర్, రాహుల్ భట్ తదితరులు తమ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.

పాతాళ్‌లోక్...సూపర్ క్లిక్
జైదీప్, అహ్లవత్ ప్రముఖ పాత్రల్లో నటించిన పాతాల్ లోక్ సీజన్ 2 కూడా మంచి విజయం సాధించింది. ప్రైమ్ వీడియో అందిస్తున్న ఈ సంవత్సరపు మరో హిట్ థ్రిల్లర్ గా నిలిచింది. హై ప్రొఫైల్ హత్య కేసు దర్యాప్తు అనుకోని రీతిలో అనేక ఇతర రహస్యాలను వెలుగులోకి తీసుకురావడాన్ని ఈ సిరీస్ ప్రదర్శిస్తుంది.

రియలిస్టిక్ షేడ్స్‌తో...బ్లాక్ వైట్ అండ్ గ్రే.. లవ్‌కిల్స్
నిజజీవిత సంఘటనల ఆధారంగా అంటూ నమ్మించేలా రూపొందిన బ్లాక్, వైట్ గ్రే కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోనీలివ్ లో అందుబాటులో ఉన్న ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. హై–ప్రొఫైల్ వ్యక్తుల వరుస హత్యల నేపధ్యంలో ఇది నిజమైన సంఘటనల ఆధారంగా దీనిని పుష్కర్ సునీల్ మహాబల్, హేమల్ ఎ ఠక్కర్ లు రూపొందించారు.

సైకలాజికల్ థ్రిల్...ఖాఫ్...
ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాఫ్ కూడా సక్సెస్ జోరు కొనసాగిస్తోంది. గత ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సిరీస్‌లో... మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రముఖ పాత్రల్లో నటించిన ఖౌఫ్ భయానక శైలి కారణంగా చాలా సంచలనం సృష్టించింది, ప్రేక్షకులపై భారీ ప్రభావాన్ని చూపింది.
ఈ ఓటీటీ షోలను అసాధారణంగా చేసింది దీర్ఘకాలం పాటు కొనసాగే ట్విస్టులతో కథ చెప్పడం, ఏదేమైనా భారతీయ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థ్రిల్లర్ల వైపు పూర్తిగా మొగ్గుతున్నారు మరోవైపు ఈ షోలు 2025లో బాలీవుడ్ బాక్సాఫీస్ కంటే ఓటీటీని రంగాన్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చాయి ఈ ఏడాదిలో ఇదే విధంగా తన పైచేయిని కొనసాగిస్తుందా?చూడాలి.