ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్‌కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్‌గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ను మరో హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.


