మెగాస్టార్ కొత్త సినిమా.. ఛాంపియన్ బ్యూటీకే ఆ ఛాన్స్..! | Champion Actress selected In Megastar Chiranjeevi latest Movie | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: మెగాస్టార్ కొత్త సినిమా.. ఛాంపియన్ బ్యూటీకే ఆ ఛాన్స్..!

Feb 15 2026 7:09 AM | Updated on Feb 15 2026 11:11 AM

Champion Actress selected In Megastar Chiranjeevi latest Movie

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన మనశంకర వరప్రసాద్‌గారు సూపర్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మెగా అభిమానులను మెప్పించింది.  అయితే మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్స్‌ ఎవరనేది ఇంకా  క్లారిటీ రాలేదు.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టాలీవుడ్‌లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రకు ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్‌ ఎంపికైనట్లు తెలుస్తోంది. ‍అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా కాదు.. చిరంజీవి కూతురిగా కనిపించనుందని సమాచారం. ఈ కథలో  పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలకు ప్రధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనస్వర నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని ఇండస్ట్రీ లేటేస్ట్ టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

a

Advertisement
 
Advertisement
Advertisement