
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ యాక్షన్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాజాగా ఈ సినిమా టికెట్ రేట్ల పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. సినిమా విడుదల రోజు నుంచి పది రోజుల వరకు ధరలు పెంచుకోవచ్చని ఆదేశాలిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.75 అదనంగా వసూలు చేసేందుకు అనుమతులు జారీ చేసింది. కాగా.. ఈరోజు రిలీజైన పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు భారీగా ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.