
టాలీవుడ్ యంగ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురించి అందరికి తెలిసిందే. ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్గా మాట్లాడతారు. కొన్ని సార్లు ఆయన చేసిన కామెంట్స్ వివాదస్పదంగానూ మారిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన మాట తీరు మాత్రం మార్చుకోలేదు. విమర్శలను సైతం తేలిగ్గా తీసుకుంటూ ఫోకస్ అంతా సినిమాలపైనే పెడుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వరుస సినిమాలను నిర్మిస్తూ.. టాలీవుడ్లో దూసుకెళ్తున్నాడు.
తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ‘జర్సీ’ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ని తిరుపతిలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో భాగ్యశ్రీపై నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నచ్చడం వల్లే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నానని చెప్పారు. ‘ఒకవేళ ఈ సినిమాలో మీరే హీరో అయితే ఎవరిని హీరోయిన్గా తీసుకుంటారు?’ అని యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు వంశీ పై విధంగా సమాధానం ఇచ్చాడు.
‘భాగ్యశ్రీని నేను కావాలని హీరోయిన్గా పెట్టుకున్నాను. విజయ్ కానీ, గౌతమ్ కానీ నన్ను అడగలేదు. నాకు భాగ్యశ్రీని నచ్చి హీరోయిన్గా తీసుకున్నాను. నేను హీరో అయితే జనాలు సినిమా చూడరు కాబట్టి విజయ్‌ని పెట్టాను’ అని వంశీ అన్నారు.