కిడ్నాప్‌ చేసి బెదిరింపులు.. తేజ కుమారుడిపై కేసు | Extortion Case Filed on Director Teja Son Amitov Teja | Sakshi
Sakshi News home page

దర్శకుడు తేజ భార్య, కుమారుడిపై కేసు

Jan 31 2026 11:44 AM | Updated on Jan 31 2026 11:52 AM

Extortion Case Filed on Director Teja Son Amitov Teja

ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్‌తేజతో పాటు ఆయన తల్లి, మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2005లో మోతీనగర్‌కు చెందిన ప్రణీత్‌, దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్‌ క్రెడిట్‌కార్డు ప్రాసెసింగ్‌ అప్లికేషన్‌ ద్వారా కలుసుకున్నారు. తన తల్లి శ్రీవల్లితేజ డీమ్యాట్‌ ఖాతాను నిర్వహించాలని కోరుతూ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసుకుందామని అమితోవ్‌తేజ చెప్పాడు.

కిడ్నాప్‌ చేసి మరీ..
తేజ తరపున ట్రేడింగ్‌ పేరిట జరిగిన లావాదేవీల వల్ల తనకు సుమారు రూ.11 లక్షల నష్టం వాటిల్లిందని ప్రణీత్‌ ఆరోపించాడు. గతేడాది మే 24న అమితోవ్‌తేజ అనుచరులు మణికుమార్‌, రాంనాథ్‌ రెడ్డి, లక్ష్మీకాంత్‌ రెడ్డిలు తనను కిడ్నాప్‌ చేసి జూబ్లీహిల్స్‌లోని తేజ నివాసానికి తీసుకెళ్లి ఖాళీ పేపర్లు, చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ప్రణీత్‌పై తేజ కుమారుడి ఆరోపణలు
నిందితులపై కేసు నమోదు చేయాలంటూ బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు అమితోవ్‌తేజ, ఆయన తల్లి శ్రీవల్లి, అనుచరులు మణికుమార్‌, రాంనాథ్‌, లక్ష్మీకాంత్‌లపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ట్రేడింగ్‌లో పెట్టుబడి పేరిట ప్రణీత్‌, అతడి భార్య రూ.72 లక్షలు మోసం చేశారని ఇటీవల అమితోవ్‌తేజ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆ దంపతులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement