అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా? | Vijay Devarakonda Kingdom Movie First Song | Sakshi
Sakshi News home page

Kingdom Song: 'కింగ్డమ్' స్టోరీని రివీల్ చేసిన మొదటి పాట

May 2 2025 4:57 PM | Updated on May 2 2025 5:29 PM

Vijay Devarakonda Kingdom Movie First Song

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. మే 30న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల ముందు వరకు సినిమా వాయిదా పడుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ తాజాగా పాటతో ప్రమోషన్స్ తో మొదలుపెట్టడంతో పుకార్లకు చెక్ పడింది. ఇప్పుడు ఆ పాటని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: అనిరుధ్ కి విజయ్ దేవరకొండ 'ప్రేమలేఖ' 

'హృదయం లోపల..' అంటూ సాగే ఈ గీతంలో కింగ్డమ్ సినిమా కథేంటి అనేది కొంతలో కొంత రివీల్ చేశారని చెప్పొచ్చు. సూరి అనే రౌడీ, ‍అతడితో ప్రేమలో ఉన్న ఓ డాక్టర్.. వీళ్లిద్దరూ కలిసి శ్రీలంక ఆర్మీపై ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపించారు. అదేంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి.

కింగ్డమ్ సినిమాలో సూరి అనే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించాడు. అతడి ప్రేయసిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ పాటలో ఓవైపు చంపడం చూపిస్తూనే, చివర్లో రొమాన్స్ కూడా చూపించారు. సినిమా కూడా అటు యాక్షన్, ఇటు రొమాన్స్ అనేలా ఉంటుందని హింట్ ఇచ్చారేమో?

(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. నెల్లూరు పెద్దారెడ్డి తాలుకా!

Advertisement
 
Advertisement
Advertisement